ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథమాశ్వాసము
5
- బలులు పెక్కండ్రు నృపతులు వెలసి రందు, వినుతి వహియించె గోవిందజనవిభుండు.23
క. వెలయుం దత్సుఁతుడై యతి, బలధృతియై తిమ్మధరణిపతి వైరిసతీ
- కలితాంజనబాష్పఝరీ, హలహలికాంజనధరీకృతాఖిలగిరియై.24
సీ. విడు పైఁటచెఱఁగు నే వెఱతు గాయము మాననిమ్మని ఛాయ యెంతేసి వేఁడ
- నశ్విను ల్మందులకై ద్రోణగిరికి నిచ్చలుఁ బోవుకతన వేసరుకొనంగ
- నిరుపద్రవముగామి నిలువరాదని రమాపతి వేఱపాలెంపుఁ బట్టు వెదక
- నాయయ్య కిదియపాటాయంచు నలసింహికాతనూభవుఁ డౌడు కఱచికొనఁగఁ
- జెలఁగి తొగకొమ్మమొగ మింత చేసికొనఁగఁ, దిమ్మనృపశౌరి దినదినోద్భిన్నవైరి
- వారబహువారభేదనవర్ధమాన, మైనరవిమేనిపెనుగండి మానదయ్యె.25
క. ఆరసికమౌళి ముద్దుఁగు, మారుఁడు శరజాతవృత్తి మనియె న్గనియెం
- దారకగర్వనివారక, సారకనత్కీర్తి లక్కజనపతి ధరణిన్.26
సీ. ఆర్కవంశమువారమని దుర్ణివారులై గుడిసెకై జిల్లెడు గొట్టఁబోరు
- హరిభ క్తిగలవారమనుచు సన్నద్ధులై వేఁటకై సింగంబు వేఁటఁబోరు
- కడువిరక్తులమంచుఁ దడవిండ్లు గైకొని యేచి పుల్గులమీఁద నేయఁబోరు
- భార్గవగోత్రసంభవులమంచుఁ దలంచి గట్టులపైఁ దరుల్ మెట్టఁబోరు
- సంగరాంగణసంగతశౌర్యధైర్య, ధుర్యు లక్కమహీపాలవర్యధాటి
- కాపలాయితమత్తప్రతీపభూపు, లడవిలోఁ బాతకాఁపులై యలరునపుడు.27
గీ. అమ్మహైశ్వర్యసంపన్నుఁ డంబకాగ్ర, చంచలీకృతదుర్మనోజాతుఁ డగుచుఁ
- గలితమైన సదానందకారి గరిమఁ, దనరు తిరుమలదేవి నుద్వాహమయ్యె.28
గీ. ఆ తిరుమలాంబయందు లక్కావనీశుఁ, డతులరవితేజుఁ దిప్పభూపతి బిడౌజు
- లక్కనృపవర్యుఁ దిమ్మవిలాసధుర్యుఁ, గృష్ణనృపచంద్రు నారాయణేంద్రుఁ గనియె.29
క. వారలలోపలఁ దిప్పధ, రారమణుఁడు వెలయు రాజరా జనఁగఁ గృపో
- దారుండు లబ్ధకవచ, స్ఫారగుణాపార్థవైరిబాణక్షతియై.30
సీ. పద్మము ల్మైనిండఁ బర్వ నుస్సురుమంచుఁ దలయూఁపఁదొడఁగె వేదండపాళి
- కమలము ల్క్రేవలఁ గదియ వెల్వెలవాఱి కాలూఁదలేఁ డయ్యె వ్యాలభర్త
- యజ్ఞరేఖాప్తిపై నమర నిద్దురమాని నిలిచినచో నిల్చెఁ గులధరాళి
- వనజాతములచ్చాయ దనరి కంపనమొంద రోమోద్గమముఁ జెందెఁ గ్రోడమౌళి
- తమ్ముఁ బెడవాసి వసుధాసుధాకరాస్య, క్రొత్తవలపంటి ననవంటి కొమరువంటి
- నీటుకాఁడైన యలతిప్పనృపతిఁ జేర, విరహగరిమంబు తమయందు వీలుకొనఁగ.31