ఈ పుట అచ్చుదిద్దబడ్డది
74
కువలయాశ్వచరిత్రము
- కొమ్మని యీఁగఁజెల్లునె యకుంఠితచాతురి గల్గియుండినన్115
గీ. అని పలుక నెంత లే దామృగాక్షిమాట, వినకు మడుగుము వర మిత్తు విభుఁడు తనకు
- నంతచను విచ్చినాడన నవ్వధూటిఁ, జుఱుకు చుఱుకునఁ బార్వతిఁ జూచె నపుడు.116
చ. ఉరగవిభుండు లేచి కుధరోద్భవఁ గన్గొని యమ్మ మేదినీ
- వరుఁడు ఋతధ్వజుండు భుజవైభవశాలి మదాలసాసతిం
- బరిణయమౌదునంచు నిజమందిరమం దిరవొందఁ జేసి త
- త్తరుణి వయస్యఁ గుండల వితావితఁ గానక వంతఁ గుందెడున్.117
గీ. వారి నిద్దరి రప్పింపవలయు ననిన, గిరిజ కానిమ్మనంగఁ దత్సరసిజాక్షి
- కాని కుంతల రాదంచు గంగ పలుక, నభవు డిద్దరియందు మధ్యస్థుఁ డగుచు.118
గీ. మంచి దహిరాజ రెండునా ళ్ళించుమించు, గాగఁ గుండల చనుదెంచు గాక యిప్పు
- డమ్మదాలస వచ్చు నీ వఱుగుమనిన, నదియ పదివేలుగా నెంచి యాతఁ డఱిఁగె.119
ఉ. అంతటిలోననే యలమదాలస నిద్దురవోవ నయ్యుమా
- కాంతుఁడు మాయచే నురగ కర్తృగృహంబున నిల్పనాతఁ డ
- త్యంతము సంతసించి తనయాత్మజుగా నురరీకరించి య
- య్యింతిని గొల్వ వేవురు మృగేక్షణల న్నియమించి యత్తరిన్.120
చ. తనయులఁ బిల్చి మీరు వనితామణి వచ్చిన మాటఁ దెల్పక
- జ్జనపతిఁ దోడి తెండనఁ బ్రసాదమటంచును వార లేగి గ్ర
- క్కున నుడిగంపుఁ జేడియలు కొందఱు గొల్వఁగ నున్న భూవరుం
- గనిన నతండు నిండుకుతుకంబునఁ జేరున నుంచి యిట్లనున్.121
ఉ. ఇన్నిదినంబు లంబుజననీశుఁడు చెందొవయిండ్లలోన ర
- క్కొన్న మదాళి బద్మగృహకోటికిఁ బొమ్మని తీవరించు నం
- తన్ననుఁ జేరవత్తురుగదా యెకయామము బోవుదాక రా
- కున్న తెఱంగు మాకు వినయోగ్యమ యేని వచింపుఁ డింపుగన్.122
క. పరబలఖండనమంత్రా, చరణమొ గృహకృత్యగతవిచారమొ కాకో
- దరపుత్రులార మీ, రిట కరుదేరక యుండ నాఁగినది యెయ్యదియో.123
చ. అనుడు భుజంగరాజసుతు లట్టివి యేవియు లేవు లెండు మా
- జనకుఁడు మీగుణంబు విని సంతసమంది మిముం గనుంగొనన్
- మనమునఁ గోరి తాన పయనంబయిన నలదా యిలాబలా
- రిని దొడిఁ దెత్తుమంచు వివరించుటకై తడవుంటి మిత్తరిన్.124