ఈ పుట అచ్చుదిద్దబడ్డది
64
కువలయాశ్వచరిత్రము
- లేఁడు పొమ్మని యనకున్నవాఁడు గాన, దళితపాంథవిహార శీతలసమీర.32
క. కడుఁ దాత్పర్యము నాపై, నిడుతామరపాస్రుతోడి యీనెయ్యంబు
- న్విడు కారింపకు మదిఁ, జెందెడుతాలిమి నొక్కవిడుత తెమ్మెరబుడుతా.33
గీ. ఆనుచు నిక్కాంత వలవంతఁ బెంచి వేఁడి, దొరలఁజెందిన కమ్మదెమ్మెరల దూఱి
- ముమ్మరమగు తాపమ్ము గ్రమ్మిఁ దమ్మి, పానుపున సొమ్మసిల్లుచు మేను సేర్ప.34
ఉ. ఏను మనంబులోనఁ జెలు లింద ఱలంతలఁ జెందిరంచు
- నప్పానుపునందు నిక్కలికిప్రక్కనె యించుక పవ్వలించు న
- చ్చోనిఁక నేమి తెల్పుదు యశోధన కోలలఁ గొట్టి లేపిన
- న్మే నెఱుఁగంగనీ కొదవె నిద్దుర యిద్దురవస్థకై వెసన్.35
ఉ, అంతట మేలు కాంచి నయనాబ్జము లొయ్యన విచ్చిచూడ ని
- క్కాంతయు నేను నిక్కుధరగహ్వరపట్టనరాజగేహసౌ
- ధాంతమునందు నుంటిమి మహాత్మక యిప్పు డిదేమొ యంచు మే
- మెంతయుఁ జింత వంత గుఱియింప భయంపడి యున్న గ్రక్కునన్.36
క. పాతాళకేతుఁ డఁట యొక, దైతేయుఁడు చేరవచ్చి దంభోళిహటా
- త్పాతాద్రిభీతహరిణీ, రీతిం దగు మమ్ముఁ జూచి కృతహాసముతోన్.37
క. లోకములన్నియు నన్నుం, గైకొని పూజించు మీరుగా మీ రానా
- ళీకాంబకుఁ బూజించితి, రాకామినులార నాకరం బెఱుఁగరొకో.38
గీ. ఇప్పు డేమయ్యె నింక నాయించువింటి, వాఁ డనుఁగునేఁడు గూర్చి మీవాంఛ దీర్చ
- నేర్చునో నేరడో చూచి నెలఁతలార, యింపుపసలార నన్నుఁ బూజింపుఁ డనుచు.39
క. ఒక హెగ్గడి దానననా, యకుతో నేమేమొ తెలిపి యాతఁడు వికట
- భ్రుకుటీపటుతరనిటల, ప్రకటీకృతరోషుఁడై సభాస్థలి కరుగన్.40
క. ఆవచ్చిన చెలి నాతో, నేవగల ఋతధ్వజేంద్రుఁ డితనిం జంపం
- గా విడిసినాఁడు బ్రదికితి, రీవేళ కుఁ దాళుఁ డనుచు నేగె న్వేగన్.41
గీ. నాఁటనుండియు వలవంత నాట నీవ, ధూటి పడుపాటు కనుచు దోధూయమాన
- మానసాంభోజనై యున్నదాననయ్య, యనఘ నాపేరు కుండల యండ్రు సురలు.42
వ. మహాత్మా! యిది మదీయవృత్తాంతంబు దురంతసంతాపచింతాపరాయత్తం బగు
- చిత్తంబు వివరింప భవత్కథాకథనంబున కడ్డంబుగా నింతయు విన్నవించితి నీయప
- రాధంబునకుం బ్రార్థనారంనారంజకంబగు నంజలి రచియించెద నాఁడు ఋతధ్వజవసుంధ
- రాపురందరు దారునం జూచుటంజేసి నిర్ధారణాసామర్ఖంబులేమిం జేసి డోలా