ఈ పుట అచ్చుదిద్దబడ్డది
52
కువలయాశ్వచరిత్రము
- యపుడు నీచిత్త మే వచ్చు నిపుడు వట్టి, మాటలాడినఁ గలదమ్మ మానుషమ్ము.116
క. కొమ్మలకుం బురుషులకుం, గమ్మని విలుకాఁడె వేల్పు గావున నతని
- న్నెమ్మదిగాఁ బూజింతము, రమ్మీ యలకేలివనికి రాజీవముఖీ.117
క. అని పలికి యేను నెచ్చెలు, లును మచ్చిక హెచ్చ నీవిలోలేక్షణఁ దో
- డ్కొని వచ్చి కుసుమవిసృమర, వనిఁ జొచ్చి రసార్ద్రవచనవైఖరి బెరయన్.118
చ. అలవడఁ జంచలాలియుతమై సుమనోహరచాపహార్యన
- ర్గలగతి మించి పాదపవికస్వరవైభవహారియైన యీ
- యలఘువనోల్లసద్ఘనమహత్వము నేమని చెప్పవచ్చునో
- లలితలతాంగి కామితఫలంబు లొసంగుచుఁ బ్రోచు నంపఱిన్.119
మ. పొలఁతీ యాపొన గున్నపొన్నవిరికిం బూఁదేనె బల్కాల్వగా
- యలరన్ సారెకు నెక్కుచుం దిగుచు చాలై దుమ్మెద ల్మించె ని
- చ్చలపుం జాయలతావిజాజివిరి నేజాజోడు గైకొన్న క్రొం
- దలుకుం బచ్చలమేడఁ దార్చు జలయంత్రంబో యనం గంటివే.120
మ. సరసాళు ల్నిజగంధ మానుచుఁ జరించం గుంభినీజాతము
- ల్వరుసం జుట్టుఁ జెలంగుచుండ మహావాలంబుకుం జాస్తిచేఁ
- గర మొప్పార సుధాప్రభావమధువు ల్గ్రాల న్విదాహాతివి
- స్ఫురితంబై విలసిల్లె నోయబల యీపున్నాగముం జూచితే.121
చ. అరవిరివెండిచెంబుల నయంబునఁ దేనియపానకంబు లేఁ
- బరువగు గుజ్జుమావి చలిపందిరుల న్లతకూన లియ్యఁగా
- నరుదుగఁ గ్రోలియు న్సరసిజాస్త్రగుణస్థితిఁ గండుదేఁటి ని
- బ్బరమగుబాళిమై నధరపల్లవ మంటుటఁ గంటివే చెలీ.122
చ. హితగతి నిందుబింబరుచు లింపుఘటింప మనోజకాండసం
- గతిఁదగు కైరవారముల గర్వము మించె వధూటి కంటివే
- హితగతి నించుబింబరుచు లింపుఘటింప మనోజకాండసం
- గతిఁదగు కైరవారముల గర్వము మించుట చోద్యమే చెలీ.123
చ. తనతను వెల్ల దాఁచికొని దక్షిణమారుతచోరకుండు నే
- ర్పునఁ జనుదెంచి తావిఁ గొనిపో వనదేవత హెచ్చరిల్లి కో
- యని పెనుఁబోటుఁగూఁత లిడునట్టిగతి న్విననయ్యె వింటివే
- యనుపమగాత్రి కోకిలకులాకులకేళి కుహూకుహూధ్వనుల్.124