ఈ పుట అచ్చుదిద్దబడ్డది
44
కువలయాశ్వచరిత్రము
క. మనలం దెచ్చిన యాదై, త్యునిబాధలఁ గలఁగి మునులుతో తెరఁగ న
- జ్జనపతి యాతనితో నిదె, యని సేయుచు నున్నవాఁ డటంచును వింటిన్.45
క. పురదనుజకామినులు కా, తరలై తరళైకహృదయతం గుందుచు నా
- తురలై గరళైధితవా, క్పరతంత్రత మాని యునికి గనుఁగొను మబలా.46
క. గావున నృపతి జయించెం, గావలయుం జూడు మెడమక న్నదరు ననం
- గా విని పలికినదానవు, నీవా యని చూచి కామినీమణి కలఁకన్.47
గీ. యేటి పలుకమ్మ యతడు నన్నేల యేలు, తిరిగి సంధించి నన్ను బోధించరాకు
- మింత యేమిటి కింక నాయించువింటి, వాని కెక్కినప్రాణమే వామనయన.48
చ. అని పలుకం ధరాధిప సురాధిపుఁ డీసతి నెమ్మనమ్మునన్
- నను నెనయం దలంచుట కనంబడె బోటి ఋతధ్వజేశ్వరుం
- డని కొనియాడె గాన నటులైనది నిక్కమయ్యెనేని నే
- దను విపు డీవధూమణి పదంబుల వైవఁగఁ దామసింతునే.49
శా. నాభాగ్యం బదిరయ్య యీయతివ యందం బిందు భావించినా
- కేభంగిం గవయంగఁ గల్గునని యూహింపన్ మదర్థంబుగా
- నాభీలాభవభూరిఫాలదహనాభానంగకౌక్షయక
- క్షోభక్షయృతఁ జెందియున్నయది యిచ్చో మెచ్చవచ్చుం గదా.50
చ. ననుఁ గొనితెచ్చినట్టి మునినాయక నిన్ను నుతింతు నోబలా
- మునిఁ గొనియాడనేల పెనుమొక్కలిరక్కసి అనికై కదా
- యనుకలధావనాపరహయంబుగ వచ్చితి గాన నింక నా
- తని యవదాన మెంచవలదా జలజాలక నిందుఁ గాంచుటల్.51
చ. ఇప్పు డిటు కానుపించుకొని యేను ఋతధ్వజరాజనంచు
- దట్టపుదమిఁ దెల్పి జాణ యగుటన్ జెలి యెవ్వలికేఁగ సిగ్గు దో
- రపువగకొంకు జారఁగ బరాబరి సేయుచు నిందు మారుక
- య్యపురుచిఁ జూపి దీనివిరహంబుధికిం గడఁ జేరనిత్తునో.52
సీ. యీగుబ్బ లిఁకమీఁద నాగోటికొనధాటి గదిసిన గజిబిజి గాకయున్నె
- యీమోవి యిఁకమీఁఁద నామోము మునిపంటిఘాతచే నలిబిలి గాకయున్నె
- యీదేహ మిఁకమీఁద నాదు కౌగిలిగింత వగచేత వసివార్లు వాడకున్నె
- యీకురు లిఁకమీఁద నాకూర్మిపెనఁకువ, పాటుచేవడిఁ జిక్కువడకయున్నె
- చిక్కువడుగాక యేమి నాచింత దీర, ననుభవింపక పోనేర నకట యిట్టు