ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ద్వితీయాశ్వాసము
37
- నడచి పడువారును క్షతంబుల వెడలు ప్రేవుల నూడనీక యదిమి కదనోన్మాదం
- బున దుప్పటులు బిగియించి యెదిరించువారును గెలుపుగాయంబులఁ బడియుం
- డియు మండిగాలిడుకొని కైదువులు జడిపించుకొనుచు రౌద్రాకారంబున ను
- న్నవారును గళ దెలిసి నలుదిక్కులుం బులుకుపులుకునఁ జూచి మానధనంబునం
- దొడిగినచల్లడంబు లక్కడక్కడఁ జించుకొనువారును బ్రాణనిర్యాణసమయంబు
- నందును నిజస్వామివిజయంబె విచారించువారును నడుగకమున్న యభ్యర్ణంపుమడుఁ
- గుల జలంబు దెచ్చి దప్పి నివారించు బంటుల ఋణంబులు దీర్చుకొని వారితో నా
- త్మీయులకు వలయు బుద్ధు లుపదేశించువారును దెట్టువలుగట్టియున్న క్రొన్నె
- త్తురులు గనుంగొని నెత్తురుకళవట్టి తమకుఁదామ వ్రాలువారును దొలఁగ క
- క్కడక్కడ భద్రపఱచిన ముదురుమానిసులకతంబునఁ బోఁగూడక నమోనమో
- యనుచున్నవారును గ్రించుఁదనంబునఁ గొంచెపాటి చెనకులఁ దెచ్చికోలు వేదన
- లంబడి తన్నుకొనువారును గలిగి సంగ్రామంబు గావున నధికధామంబును జన్యం
- బు గావున భూతక్రియామాన్యంమును సమరతలంబు గావున ధమోజ్జ్వలంబు
- ను నై యాసమీకంబు సమాకులితనాకలోకం బయ్యె మఱియు.148
గీ. పోరఁ బెనువానగా రక్తపూర మొలుకు, కాయములు పూను భూతనికాయనమలరెఁ
- గేళిగతి నిల్చు రణభద్రకాళిమ్రోల, వరలు పన్నీరుతిత్తులవా రనంగ.149
సీ. గ్రుడ్డులు మిడికించుకొని దప్పి కిమ్మను దమవారి నొక్కబేతాళమౌళి
- గొంతు మ్రోచిన దిగుల్కొని నోర వ్రేలిడి క్రక్కు నొక్కపిశాచికావిభుండు
- అన్నువట్టినను మ్రాగన్నుతోఁ బొర్లాడు నేలపై నొకడాకినీవరుండు
- కక్కుర్తి మెక్కి యగస్త్యమంత్రము వల్కు బొడ్డు నంటుచు నొక్కభూతనేత
- తనివితీఱినత్రేఁపు విన్నునకునిక్క, శతపదాల్ ద్రొక్కు నొక్కనిశాచరుండు
- పలలరాసుల బువ్వంపుబంతివిందు, మించుఁబోఁడులతో నారగించువేళ.150
గీ. ఒక్కని కళేబర మరసియుఁ దగఁదినక, వీనిఁ బడవైచె నాతఁ డావీరుఁ డనుచు
- గా దనుచుఁ గుమ్ములాడునక్తంచరాళి, యెంతకార్యంబు దమ కేమి యెవ్వఁ డైన.151
క. ఒకవీరవరుకబంధము, నకు మూఁగి పిశాచికాగణము భూతావే
- శకమున నది యెగిరినచోఁ, బకపక నవ్వించె నులికిపడి డాకినులన్.152
సీ. శౌనకమౌని విశ్వామిత్రుతోఁ దెమ్ము పన్నిదం బనుచుఁ జేపట్టి తిగువ
- శుకుఁడు[1]
- ↑ ఇక్కడఁ గొంతగ్రంథభాగము మాప్రతిలో లేదు.