ఈ పుట అచ్చుదిద్దబడ్డది
32
కువలయాశ్వచరిత్రము
- జూచు సంగీతమేళంబు సొగసుకాండ్ర
- ధిమ్మనెడి మద్దెలలమ్రోత గ్రమ్ముకొనియె
- రాజు పవళించు తెలిగుడారంబుమ్రోల.109
చ. నలుఁగిడి చల్వదాల్చి పయనంపు టలంతల నిద్రఁ జెంచురో
- వెలఁదుల లేపఁ గొంకి పతివింతగుడారపు పారివారిగం
- టలరొద కుల్కిలేవఁ జిఱునవ్వులతోఁ చమవారిఁ గూడి యిం
- పుల తమి దీఱినన్ నిదురవోయిరి నన్పుబొజుంగు లత్తఱిన్.110
చ. గుమిగొని తెచ్చికోలుకుసిగుంపులఁ జెట్టులనీడఁ బొట్టిమం
- చములపయి స్శయించి పటసారకుటీరము లెత్తితే మేలిజా
- నమున రమించు పల్లవులనంటున నేరము లెన్నుచు న్నృప
- ప్రమపల మ్రోల నీటు నెఱపం బనిపూనిరి గుత్తలంజియల్.111
చ. కనుకని తెల్లవాఱుదనుక న్రతిగోరెడు పల్లవాళిమే
- ల్గనుఁగొని వీడెముంగలుపు లాహిరిమేపుల నిద్రఁబుచ్చి చెం
- దిన చిఱునవ్వుతో నపుడె నిద్దురలాయని వింతపైఁడి ప
- ట్టిన వెలముద్దుగుమ్మలు వడిన్శయనించిరి చప్పరంబులన్.112
క. అల పాళెమునకు నిలుపని, బలకరమై పారివారిపరియై తెగును
- క్కళమై నిదురించని సరి' వలపుల వెలచెలుల విటుల వర్తిలు టమరెన్.113
సీ. ఒక్కండు పట్టుగా నూఁకొనఁ దబ్బిబ్బుబాటు గొల్లసివాలు పాడుకొనుచుఁ
- బాము నాడించు నేర్పాటునఁ దల యూఁచికొంచును జెంగు విన్పించుకొనుచుఁ
- దమవారి గుమిగూడి దమ్మ రాజులకత ల్నోటి కడ్డము లేక నొడివికొనుచు
- లయ యొక్కత్రోవ తాళం బొకత్రోవఁగా నేమేమొ ఢక్క వాయించుకొనుచుఁ
- జిటుకుమన్నఁ బరామరిశించుకొనుచు, నంటుకత్తెలు తమపయనంబు సమ్మ
- తించకాడిన వగఁ జెప్పుకొంచుమించి, రుక్కళపునల్లమందుల యొంటికాండ్రు.114
సీ. వెఱవకుమని వెన్ను చఱచి వేలుపుఱేఁడు తెలిపిన నింద్రాణి తెలియదయ్యెఁ
- దను తానె తెలిసి మూసినకంటితో వాణివీనులపైఁ గేలు మానదయ్యె
- నది పరామరిశింతునని యేగు పతినాఁగి జలధినందనకొంగు విడువదయ్యె
- దడదడమన గుండె తాళిబొ ట్టదర గుబ్బలిపట్టి పడుకయి ల్వెళలదయ్యె
- బాళెమున నక్కడక్కడఁ బదిలమునకు, మ్రోయఁజేసినతముకుల మొదలిపోటు
- దారమ్రోతల పటహంపుధణధణలకు దొంతిగా నిండ్ల నిటులున్న యంతలోన.115