ఈ పుట అచ్చుదిద్దబడ్డది
28
కువలయాశ్వచరిత్రము
చ. అన విని యంతయేమిటికి నానతి యిచ్చెద రిన్నినాళ్ళుఁ ద
- ద్దనుజుని నొంచి మీపద ముదారముదాకృతి నొందఁ జేయకుం
- డిన యది నాకు నేర మవునేకచ యాకొదవ ల్సహించిన
- న్ననుపుఁడు వానిఁ బట్టి నుఱుమాడెద నొద్దికఁ జెల్లఁ జేసెదన్.81
చ. అనిన రిపుక్షయోస్తు విజయోస్తు పతేభవతే యటంచు వా
- రనుప దురాపకోపతరుణార్కవిభాదళితారుణాంబుజం
- బనఁగను మోము కెంపుగఁ దదర్థరణోన్ముఖభృంగయుగ్మప
- ఙ్క్తినటన భ్రూకుటిక్రమము డెల్పఁగ నచ్చోటుఁ దర్లి నిల్చినన్.82
సీ. అధిపభృత్యపరస్పరాన్వేషణాకారణప్రతివక్తృతన్నామకార్య
- మననుగతస్వామి హయవేగభూరుహచ్చాయాసమాశ్రితచ్ఛాత్రకంబు
- ధాననాయాసాస్వజీవనవృత్తిధిగ్వాచకాందోలికావహజనంబు
- సమ్మర్దబహుళాదిసరణికోభయపార్శ్వచారితవారణాధోరణంబు
- సరయ సరదుష్ప్రనిష్పతజ్జరఠధూర్త, గణ్యగాణిక్యసంభవత్కమనహాస్య
- వారణక్షమతత్సుతాక్రూరదృష్టి, సంవృతాశంబు సైన్య మచ్చటికి వచ్చె.83
క. ఈరీతి సైన్యమంతయుఁ, జేరిన నొకబయట రాజసింహము భటులం
- దేరిజ వేయంబనిచి గు, డారము లెత్తించి యంతట న్రవి గ్రుంకన్.84
గీ. పఱపుటంగడి వీథు లేర్పఱచి కొంచె, పాటి నడగని నెక్కి యాపాలె మెల్ల
- విడియ నియమించి తిరిగె వేవేలు దివ్వ, టీలవెలుఁగున సంగీతమేల మమర.85
చ. తిరిగి యతండు వచ్చి నడఁదేర్పుచు ఘమ్మను వట్టివేళ్ళచ
- ప్పరము కురంగటందగు తుపారము చేరువఁ జారువజ్రపాం
- డరరుచిగ్రమ్ము గుమ్మెతగుడారమునం గొలువుండి పట్టనాం
- తరముననుండి వచ్చునరనాథులకమ్మలు వించు నున్నెడన్.86
గీ. ఊడిగపుటత్తికాఁ డొక్కఁ డొఱుఁగుఁ జేరి, విభుని చెవిలోన నేమేమొ విన్నవింప
- నతని కనుసన్న గనుఁగొని యయ్య మంచి, దతనిఁ బిలిపించెద నటంచు నఱిగివాఁడు.87
సీ. సేవమై సగము దీసిన బూదెపండుతోఁ గూడినబంగారు లాడె సింగి
- బారసీలిపిని జొప్పడ భగవద్గీత లెన్నికవ్రాసిన చిన్నిపలక
- బుడుత పసిమిరుచి పులితోలు చుట్టతో బవళిక ల్నించిన పట్టుజోలె