ఈ పుట అచ్చుదిద్దబడ్డది
10
కువలయాశ్వచరిత్రము
- నితనితోడుత వైర మీడేఱ దనుచు, సకలధరణీశు లెపుడు నిచ్చక మొనర్స
- వీరవేంకటరాయభూవిభునికరుణఁ, బరఁగు నారాయణక్షమాపాలవరుఁడు.59
సీ. తనమాట కాంచికాతంజాపురీమధురాధినాథులకు నెయ్యంబు నెఱపఁ
- దనచీటి గోలకొండనరేంద్రముఖధరాధవపద్మబంధు లౌదల ధరింపఁ
- దనకీర్తి మట్లనంతనృపాలముఖ్య గోత్రామరేంద్రులు గొనియాడికొనఁగఁ
- దనదానగుణము గోదావరీతీరభూనిర్జరేశ్వరులు వర్ణించుకొనఁగ
- వెలయు వేదండగండనిర్గళదనర్గ, ళమ ధారాధునీనాథకుముదబంధు
- కార్యకృడ్డిండిమారావధుర్యసైన్యుఁ, డతఁడు ప్రభుమాత్రుఁడే నారనాధినేత.60
షష్ఠ్యంతములు
క. ఏవంవిధవసుధాసం, భావితబహుథాకథాతిభానీరధికిన్
- గ్లావధికశిశిరనిజవీ, క్షావధికార్పణ్యబుధమహాసేవధికిన్.61
క. స్ఫుటధాటీభటకోటీ, చటులాటీకనహతారిజనపతికి శచీ
- విటగోత్రోత్కటమిత్రో, ద్భటచిత్రోజ్జృంభితప్రభావద్యుతికిన్.62
క. మణినాగనగరకాంతున, కణుమధ్యాజనమనోజయంతునకుఁ గుభృ
- ద్గణగణితరామణీయక, మణిఘృణిఫణితాతిమంజిమనిశాంతునకున్.63
క. విసృమరబహువిధవైభవ, హసితేంద్రున కసితకేతనాలోకనమా
- సముత్త్రస్తారిధరా, పసమూహావనచలత్కృపాసాంద్రునకున్.64
క. వీరారివారవారణ, వారణసృణికింగవీంద్రవర్ణితవిద్యా
- పారగతాదిమఫణికి, న్నారాయణధరణియువతినాయకమణికిన్.65
వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన కువలయాశ్వచరిత్రంబునకుం
- గథాక్రమం బెట్టి దనిన.66
ఉ. శ్రీమహితంబు భారతవిశేషకథావిధము న్విహంగమ
- గ్రామణు లేర్పడం బలుకఁగా విని భావనిరూఢహర్షుఁడై
- జైమిని యాఋతుధ్వజుని చందము లందము లయ్యెఁ దెల్పర
- య్యా మఱి యాతఁడే కువలయాశ్వుఁ డనంగఁ బ్రసిద్ధి గాంచుటల్.67
క. అనిన న్విని జైమినిమునిఁ, గనుఁగొని విహగంబు లతనికత యి ట్లనుచు
- న్వినిపించె సుధారసగుం, భనగంభీరాతిజృంభమాణమృదూక్తిన్.68
క. శ్రీకరమై నానావిభ, వాకరమై యగ్రచుంబితాంబరబహుర
- థ్యాకేతనాతిసరమై, సాకేతపురీవరంబు సన్నుతి కెక్కున్.69