Jump to content

పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పల్లకీలు గుఱాలు బంట్లు బానిసలును
                   ధనధాన్య వసన గో దంతి తతులు


తే.

కులుకుప్రాయంపు ముద్దుగుమ్మలును గలిగి
పొలుచువారలె మును నిన్నుఁ గొలుచువారు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

73


సీ.

దానహీనుండైన మానవాధము కల్మి
                   తెరలెడు జుంటీఁగ తేనెచుట్టు
చుట్టాల నతిథులఁ జొరనీని ఖలునిల్లు
                   పెనుబాము వసియించు పెద్దపుట్ట
సభలఁ బ్రసంగింపఁజాలని జనుని ప్ర
                   హృష్టసాహితి సానక్రింది వన్నె
పతివాంఛ దీర్పని పడఁతి చక్కదనంబు
                   కాననాంతరచంద్రికాప్రసక్తి


తే.

చిత్త మిగురొత్త నినుఁ బూజ సేయలేని
నరుని జన్మము మహిషజన్మము గదయ్య,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

74


సీ.

కుంభికుంభస్థలాక్షుద్రామిషము మెక్కు
                   సింగంబు కప్పల మ్రింగఁ జనునె
సారభూరుహఫలాహారలీలఁ జెలంగు
                   కీర ముమ్మెతలఁ జేరుకొనునె
యభ్రాపగాహాటకాబ్జమృణాళముల్
                   కొను నంచ బురదవాగులకుఁ జనునె
ప్రబలవర్షాంబుధారలు గ్రోలు వానకో
                   యిల యిల మంచుసోనలకుఁ జనునె