పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


                   సత్యవాక్యనిరూఢి జరుపుచుండి
యుభయవంశములకు నుపకీర్తి నించుచు
                   నిమ్ముగా నగు సుచిత్తమ్ము పూని
యత్తమామల మాట కడుగు దాఁటగఁబోక
                   మాన మాభరణంబుగా నమర్చి


తే.

మెలఁగుచుండెడి యిల్లాలు కలుగవలయు
మహితభాగ్యాన్వితుండైన మానవునకు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

38


సీ.

తనయింటి యర్థంబుఁ దానె మ్రుచ్చిలుదాని
                   ననయంబుఁ గొరకొరలాడుదాని
గయ్యంబునకు నెప్డు కాలు దువ్వెడిదాని
                   నెడపక యేవేళ నేడ్చుదాని
పొరుగిండ్లవెంబడిఁ దిరుగుచుండెడిదాని
                   ధట్టించి శిశువులఁ గొట్టుదాని
పరహితశీలయై పరగుచుండెడిదాని
                   గయ్యాళియై పతిఁ గలఁచుదాని


తే.

తవిలి పదుగురుబిడ్డల తల్లియైన
విడువవలెనండ్రు పెద్ద లిప్పుడమియందు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

39


సీ.

జగడాలచీలి వేసాలవెల్లి బిసాళి
                   తిండిపోతు గయాళి మొండికట్టె
హేయభాజనము పల్మాయలపుట్టిల్లు
                   కంతులరాకాసి పంతగత్తె
యవలక్షణముల తావవివేకములప్రోవు
                   చెరపనచేట మాసికలమూట