Jump to content

పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కడుగైనఁ దవుడైన విడిచివెట్టఁగలేక
                   మాడైన మక్కైన మానలేక


తే.

ఖలుఁడు విత్తంబు గూర్చినఁ గట్టి కొట్టి
పట్టి పుథించి నృపు లరి బలిమిఁ గొంద్రు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

18


సీ.

జారచోరులకు గంజాయికల్లులకును
                   దొత్తుల కగ్గికి దొమ్మరులకు
కుంటెనకత్తెలకును వెలయాండ్రకు
                   నల్లమందునకు భూవల్లభునకు
తప్పుదండుగలకు దబ్బరగాండ్లకు
                   నంజుటికిని గోడిపుంజులకును
మందులవాండ్రకు మాలదాసర్లకు
                   నాటపాటలవాండ్ర కౌను గాని


తే.

సుకవిజనదేవతాగృహసూరివరుల
జేరదింతయుఁ దులువ కూర్చిన ధనంబు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

19


సీ.

విధవాకుచంబులవిధమున ససి చెడ్డ
                   పాడింట నిడిన దీపంబు కరణి,
గాననాంతరమునఁ గాయువెన్నెల రీతి
                   షండున కబ్బిన చాన పోల్కిఁ
గ్రోఁతి చే నొదవిన కొబ్బరికాయ య
                   ట్లంబుధిం బడిన తోయంబు మాడ్కి
ముసిడిఁ బండిన ఫలమ్ముల చందమున దుష్ట
                   ఫణిశిరంబున వెల్గు మణి విధమున