పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


                   గోహర గోహీరదేహ, నీకు!
నతిశతక్రతుముఖాదితిసుతాతతకృత
                   స్తుతికృతామితహిత కుతుక, నీకు!
జేజేపరాజితోగ్రాజివిరాజిత
                   వ్యాజనిరీజసమాజ, నీకు!


తే.

వందన ముదార దారుకావనమునీంద్ర
సుందరీబృందమానసానంద, నీకు!
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

5


సీ.

తపననందనభటోద్దండ చండభుజంగ
                   మేఘభీషణ విహంగోత్తమంబు
బహుజన్మసంచితబ్రహ్మహత్యాముఖో
                   గ్రౌఘకాలాభ్ర ఝంఝూనిలంబు
భూతవేతాళప్రభూతవాతజ్వరా
                   ద్యామయారణ్య దావానలంబు
ఘోరదారిద్ర్యవికారభారోదగ్ర
                   వారణానీక కంఠీరవంబు


తే.

నైన వంచాక్షరిని భక్తి యతిశయిల్లఁ
దవిలి జపియించు వారెపో ధన్యతములు
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

6


సీ.

అమరమస్తకకిరీటాంచిత మనోవిభా
                   నీరాజితాంఘ్రిపంకేరుహునకు
శైలకన్యాఘనస్తనవిలిప్తమృగీమ
                   దాంకిత విపుల బాహాంతరునకు
గగనతరంగిణీకల్లోలమాలికా
                   శోభిత పటు జటాజూటునకును,