పుట:కాశీమజిలీకథలు -09.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

వైతివి కావున నీవు పుడమిఁ గిరాతకుండవై యుదయింపఁగలవని జయంతుని శపించెను.

ఆ శాపాక్షరములు విని యచ్చెరలెల్ల హా హా కారములు కావింపుచు నక్కటా! ప్రణయకలహములు ప్రళయకలహములై ప్రభుపట్టి నాపద పాలుసేసినవే? అయ్యయ్యో! ఇప్పుడేమి సేయఁదగినదని పరితపించుచుఁ గొందఱు సిద్ధునిఁ బ్రార్థించుచుండిరి కొందఱు మహేంద్రునొద్దకుఁ బోయి యార్తనాదములతో నా వృత్తాంత మెఱింగించిరి.

అప్పు డాఖండలుండు గుండెలు బాదుకొనుచుఁ బాదచారియై నందనవనంబున కరిగి తలవాల్చికొని చింతాక్రాంతస్వాంతుండైయున్న జయంతకుమారుం గాంచి పట్టీ! ఆ పిట్టలజోలి కేమిటికి పోయితివి? ఆఁడువాండ్ర తగవునకుఁ బూచికాని రానేల? శృంగారలీలలలోఁ బాండిత్యము లేకున్న వచ్చిన కొదువయేమి! ధైర్యమా సాహసమా! వితరణమా! ఏదో బుద్ధిమాలిన పక్షు లాక్షేపించినవనిం వానిం దిట్టనేల? తప్పు చేసితివని పుత్రు నిందింపుచుఁ జేయిపట్టుకొని లాగికొనిపోయి యాసిద్ధు నడుగులం బడవైచి యిట్లనియె.

సీ. మూఁడులోకములకు ఱేఁడనైతగు నాకు
               ఘనతపంబునఁ గలిగిన సుతుండు
    శచికన్నబిడ్డ యాసక్తి దిక్పాలుర
               చేతులఁ బెరిగిన చిన్న కుర్ర
    బహురత్న కిరణ భాస్వత్సౌథవీధుల
               విహరించు సుకుమార విగ్రహుండు
    పారిజాతాది కల్పద్రుమోజ్వల నంద
               నారామమునఁ గ్రీడలాడు పట్టి
గీ. పుడమి నెట్లు కిరాతుఁడై పుట్టి ఘోర
    కాననములందు మృగ ఘాతురత్వకలన
    జీవనము సేయువాఁడొకో చెప్పుమయ్య
    యనఘ? పూవులరాశిపై నగ్ని నిడుదె?

చ. కరుణవహించి వీని నిటఁ గావుము సిద్ధవరేణ్య! నాదు పె
    ద్దరికము జూచియైనఁ గడుతప్పొనరించె నితండు నందనాం
    తరముల నుండు పక్షులను ధాత్రిజనింపఁగఁ దిట్టెనే కృపన్
    వరములనిత్తు వానికి శుభంబులు గ్రమ్మరఁ జెందునట్లుగాన్.

.

వీనిపాపంబు గ్రమ్మరించి నాకు బుత్రదానంబు గావింపుమని వేడుకొనుటయు నా సిద్ధుండు మహేంద్రా! నా శాపం బమోఘము. నీకొడుకు పుడమిఁబుట్టక తప్పదు. మరియు నిన్నుఁజూచి యా శాపంబునఁ గొన్ని మార్పులు గావింతు