పుట:కాశీమజిలీకథలు -09.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవకన్యా వివాహము కథ

305

ఇంతటితో నతని చరిత్రము ముగిసినదని పరితపించుంటిని. ఇంకనుం బెక్కు కథలు గలవని చెప్పుటచే మురియుచుంటి. సావధానముగా వానినెల్ల ముందు జెప్పుదురుగాక యని యయ్యతి చరణంబుల మ్రొక్కుచుఁ గావడి యెత్తుకొని యా కథావిశేషములనే ధ్యానించుచు గురువుగారివెంట నరుగుచుండెను.

క. మంగళము శైలజామిళి
   తాంగునకుం దారహీరహారోపమ శు
   భ్రాంగునకున్ గోరాట్సు తు
   రంగునకున్ సత్కృపాంతరంగున కెలమిన్.

క. కోరిక దీరఁగ రుధిరో
   ద్గారి సమాంతరమునందుఁ దగనీభాగం
   బారూఢిఁజేసి యిచ్చితిఁ
   గారుణ్యముతోడఁ దీని గైకొనుమభవా!

గద్య. ఇది శ్రీమద్విశ్వనాథసదనుకంపాసంపాదితకవితావిచి
త్రాత్రేయమునిసుత్రామగోత్రపవిత్ర మధిరకులకలశజల
నిధిరాకారుముదమిత్ర లక్ష్మీనారాయణపౌత్ర కొండ
యార్యపుత్ర సోమిదేవిగర్భముక్తిముక్తాఫల
విబుధజనాభిరక్షిత సుబ్బన్నదీక్షితకవి
విరచితంబగు కాశీయాత్రాచరిత్ర
మనుమహాప్రబంధంబున
నవమి భాగము
సమాప్తము.
శ్రీ శ్రీ శ్రీ
శ్రీ విశ్వనాధార్పణమస్తు.

శ్రీ లక్ష్మీ గణేష్ ప్రింటర్స్ - విద్యాధరపురం - విజయవాడ 12.