పుట:కాశీమజిలీకథలు -09.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

    మార్గస్థులు సుఖింపమరుభూములను సమ
                భ్యంచితప్రపల నిర్మించినారో?
    కాశీగయాప్రయాగములు మున్నగు తీర్థ
               వితతిసద్భక్తి సేవించినారో?
    వేదశాస్త్రకళాప్రవీణులౌ బధులకు
               క్షితిదానముల నేమి చేసినారో?
గీ. తాపసుల నెందరిని రక్తి దనివినారో?
    గురువులకు నెట్టి శుశ్రూష జరిపినారో?
    కలుగునే యూరకిట్టి లోకప్రభోగ
    కాంత సౌధాంతరాప్తి సౌఖ్యము మహాత్మా.

గీ. మీరు జేసిన పుణ్యంబు తీరుదనుక
    ననుభవింతురు సకలసౌఖ్యముల నిందు
    దేవతాకామినులతోడఁ దేజమరల
    నమరపతితుల్యభోగభాగ్యానురక్తి.

మిమ్ముఁ జూడ మసుష్యదేహముతోనే పుణ్యలోకమునకు వచ్చినట్లు కనంబడుచున్నారు. ఇది చాల యద్భుతము. నే నెఱింగిన తరువాత నిట్లు వచ్చినవారిఁ జూడలేదు. మీ రెట్టి పుణ్యము జేసితిరో మీకేఁ యెఱుక యని జెప్పిన పని నేనెట్లంటి. ఓయీ యీ లోకము స్వర్గమున కొక శృంగారభవనమువంటిదని చెప్పితివి. ఈ లాటివి మఱికొన్ని గలవా ఇది యెక్కటియేనా? అని యడిగిన నాతఁ డిట్లనియె. దేవా వినుండు పుణ్యలోకముల కెల్లఁ బ్రధానపట్టణము అమరావతి. అందు మహేంద్రుఁడు వసించుం గావున దానికి రాజధానియని పేరు వచ్చినది. ఈలాటి భువనములు మహేంద్రుని యధికారము క్రిందఁ గోటానకోటలు గలవు. వానినెల్ల మహేంద్రుఁడే పాలించుచుండును. స్వర్గమన పేరు మాత్రమే కాని పుణ్యపురుషులు స్వర్గమున వసింపరు. భూలోకములో వారు సేసికొనిన పుణ్యనుసారముగా దేవదూత లింద్రునియాజ్ఞానుకూలముగాఁ బుణ్యపురుషులఁ దీసికొనివచ్చి యనుగుణముగ లోకమున నివసింపఁజేయుదురు. అది పంటభూమి. ఇవి వంటశాలలు. భూలోకమున కీ పుణ్యలోకములన్నియు నక్షత్రరూపములఁ గనంబడునని చెప్పుదురు. మీకుఁ తెలియకుండునా? అని చెప్పిన విని నేను సంతసించుచు నాహా! నాకుఁ గలిగినసందియము దీరినది. నక్షత్రములన్నియుఁ బురాణములలోఁ జెప్పినట్లే పుణ్యలోకములని తెల్లమైనది. ఇఁక మరలి నేను భూలోకమునకుఁ బోవుదునా? అని యాలోచించి సిద్దుని కరుణావిశేషంబున నింతదూరము తనే వచ్చితిని. యూరక పోనేల? కొంత భోగమనుభవించియే పోయెదంగాక. విశ్వనాథుని యనుగ్రహముండ నింద్రుండు న న్నేమి జేయఁ