పుట:కాశీమజిలీకథలు -02.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మదనుని కథ

51

పుళిందుడు — అవును, రే పమావాస్యయే కాదా! కలశస్థాపనము ఎల్లుండియే! మరచితిని. తప్పక రేపే వీరిని దీసికొనిపోదగినదే.

కళింగుడు - అయినను మనకు మరల జాబు రాకమానదు.

పుళిందుడు — ఎట్లైన నీయేడు రాజుగారు కడుదీక్షగా బరీక్షించుచున్నారు. వెల్లడి కాకమానదు.

కళింగుడు — ఏమో తెలియదు. ప్రొద్దుపోయినది యికనిద్రబోవుదుము అని వారిరువురు నిద్రబోయిరి.

ఆ మాటలన్నియు నింద్రద్యుమ్నుని చెవినిబడినవి. పుస్తకమును గూర్చి సంభాషించిరి గావున నది తనదేయనియు నా కృష్ణదాసు తన్ను బట్టినవాడేయనియు నెల్లుండి దప్పక తనకు మరణము విధియైయున్నదనియు నిశ్చయించి యింద్రద్యుమ్నుడు ధైర్యము విడువక యోగం బవలంబించి

చ॥ జలదములోని క్రొమ్మెరుగు చాయలు భోగపరంపరల్, మహా
      నిలపరిఘట్టితా జ్ఞతళనీరతుగా జీవితంబు చం
      చల తరముల్ వయోభిమత సౌఖ్యసునీగతి నాకలించి స
      భ్యులు పరమాత్మ యోగమున బుద్ధిఘటింపగ జేయుటొప్పగున్.

అని వైరాగ్యాయత్తచిత్తుండై భగవదారాధనము జేయుచుండెను.

అంత మరునాటి యర్దరాత్రంబున వారినెల్ల దొంటినెలవులకు జేర్చిరి. ఇంద్రద్యుమ్నుని గృష్ణదాసు తనయింటికి దీసికొనిపోయి వెనుకటి గదిలోనేకట్టి పెట్టించెను. మరునాడుదయంబున నవరాత్రి ప్రారంభము. అతడు మొదటి దివసమునందే యమ్మవారికి బలియిచ్చువాడుక వున్నది. కనుక నాడు ఇంద్రద్యుమ్నునికి దలయంటి మేన మంతయు బసుపు బూసిరి. మెడకు వేపరొట్ట గట్టిరి. మంచిమంచి యలంకారము లుంచిరి. అదియేమియు నమ్మహాపురుషుడెరుగడు. బాహ్యప్రచారము ఏమియు లేదు. ఆయింటిలోనే యొకగదిలో భయంకరరూపముగానున్న మహాకాళి కెదురుగా నొక స్తంభము పాతి బంగారుగొలుసులతో నతని నందు గట్టిపెట్టిరి. డమ్మహాశక్తి కెదురుగా నిలబడి తన దేహమూరకపోక కాళికకు వినియోగ మగుచున్నందులకు మిగుల సంతసించుచు విశాలాక్షిని మగనితో గూర్పుమని దేవిని బ్రార్థించుచు సర్వసంగములు విడిచి మనం బీశ్వరాయత్తంబు గావించి తనమెడకు కత్తివ్రేటునకు వాటముగా నుండు నట్లు వాల్చి మరణసమయ మాకాంక్షించి యుండెను.

వానిధైర్యమునకు నర్చకులందరు వెరగుపడిరి. కాళియు గజగజ వణకజొచ్చినది. అర్చకులు పుష్పపూజావసానమున ధూపమును దీపమునుం దీర్చి మహానైవేద్య సమయమైనది. ఇక బలి యియ్యవచ్చును. వ్రేయుడని పలుకుచున్న సమయములో గృష్ణదాసు వీధి తలుపులు తీయుడని యరచుచు నెవ్వరో వీధిలో సందడిచేయు