పుట:కాశీమజిలీకథలు -02.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శుభమస్తు - అవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

రెండవ భాగము


13వ మజిలీ

శ్లో॥ యాకుందేందు తుషారహారధవళా యాశుభ్రవస్త్రావృతా।
      యావీణావరదండమండితకరా యాశ్వేతపద్మాసనా॥
      యాబ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్పదాపూజితా।
      సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా॥

వ॥ అట్లుమణిసిద్ధుండు శౌనకుండను నామాంతరముగల యగ్గోపాలుతోగూడ జగన్నాథంబు ప్రవేశించి యందొక మఠంబున వసించి భక్తజనపరాధీనుండగు సుభద్రానాథు నారాధించునుత్సుకంబు మనంబున నగ్గలంబగుచుండ వానితో నిట్లనియె.

వత్సా! సకలజగన్నాయకుండగు జగన్నాయకుం డిందు సుభద్రాభిధానలక్ష్మీసమేతుండై నివసించియున్నవాడు. ఇమ్మహానుభావుని ప్రభావము మిగుల నద్భుతమైనది. తన ప్రసాదము నిందించిన వారి నాక్షణమే యిడుమలంగుడిపించును. వేగమె యాగమోక్తవిధానంబున నాస్వామి నర్చింపవలయును. నేను స్నానముజేసి వచ్చెద నంతదనుక భద్రముగా నిందుండుమని పలికిన విని వాఁ డయ్యతితిలకున కిట్లనియె.

ఆర్యా ! భవదీయ సబోధావిశేషంబున నాకు వెనకటికన్న లౌకికజ్ఞానం బభివృద్ధియగుచున్నది. శ్రుతంబకాదే యెట్టివానినేనిఁ బండితునింజేయు నాకును దేవతాదర్శనము జేయ వేడుక యగుచున్నది. స్నానముచేయ మీ వెంటవత్తు మనసొత్తుఁ గొనువారెవ్వరు నిందు లేరు. అనుజ్ఞయిండని వేడుకొనిన నయ్యతి సంతసించి వాని రాక కియ్యకొని చయ్యన వానితోఁగూడ నింద్రద్యుమ్నసరస్సుకుం జని యథావిధిని దీర్థోపకృత్యములు నిర్వర్తించి మించిన భక్తివిశేషంబున నారాయణమంత్రంబు