పుట:కాశీమజిలీకథలు -02.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సునందకథ

255

గోపా! నీవు చూచినవారు విహారభద్రుఁడును. దుర్వినీతుఁడునులే! దానఁ బట్టియే "దుర్జనులకు బుద్ధివచ్చు పని" యని దానిపై వ్రాసిరి. ఇదియే దీని వృత్తాంతమని మణిసిద్ధుఁడు చెప్పి సంతోషపారావారంబునం దేలుచున్న శౌనకునితో బయలుదేరి తరువాయి మజిలీ చేరెను.

మాలిని. నిరుపమగుణభూషా! నిత్యసంతోషవేషా!
            సురగురమునిపూటా! స్తోత్రసంసక్తతేజా!
            నరహరిసదబిఖ్యా! నందితాదిత్వముఖ్యా!
            స్థిరతరగునుకీర్తీ! దేవతాచక్రవర్తీ!

గద్య. ఇది శ్రీమద్విశ్వనాథ సదనుకంపాసంపాదితకవితా విచి

త్రాత్రేయమునిసుత్రామగోత్రపవిత్రమధిర కులకలశజల

నిధీరాకాకుముదమిత్ర లక్ష్మీనారాయణపౌత్రకొండ

యార్యపుత్రసోమిదేవీ గర్భశుక్తముక్తాఫల

విభుధజనాభీరక్షిత సుబ్బనదీక్షితకవి

విరచితంబగు కాశీయాత్రాచరిత్ర

మను మహా ప్రబంధంబున

ద్వితీయ భాగము

సమాప్తము

శ్రీ విశ్వనాధార్పణమస్తు.

ముద్రణ: విజయశ్రీ ప్రింటర్స్, విజయవాడ - 3.