పుట:కాశీమజిలీకథలు -02.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంతిమతి కథ

197

అదృష్టదీపు డట్లు రాత్రివేళ నింటికిబోయి పశ్చాత్తాపము నొందుచు ఆహా! జగంబంతయు గామహతకునిచే వంచింపబడుచున్నది కదా?

శ్లో॥ కాంతేత్యుత్పలలోచనేతి విపులశ్రోణీ భరేత్యున్నమ
     త్పీనోత్తుంగ పయోధరేతి సుముఖాంభోజేతి సుభ్రూరితి
     దృష్ట్వామాద్యతిమోదతేభిరమతే ప్రస్తాతి ద్వానపి
     ప్రత్యక్షాశుచిభస్త్రికాం స్త్రయమహోమోహస్యదుశ్చేష్టితం.

విద్వాంసులుగూడ మాంసాదులచే రచింపబడిన తోలుబొమ్మను జూచి కాంత సుముఖ, సుభ్రూ మొదలగు నలంకారములు గల్పించుచు స్తుతిజేయుచు గ్రీడింపుచుందురు. నేను జగద్విదితమగు ఖ్యాతిని సంపాదించి చివరకీ కాంతమూలమున చోరునివలె నాతోటలో దాగియుండవలసివచ్చినది. దైవానుగ్రహమువలన నా లలన దాటించినదికాని లేనిచో గారాగారంబునకు బంపబడియుందును. నాకింత ప్రారబ్ధమేల వచ్చెను. ఆ మచ్చెకంటిం బెండ్లిచేయుమని యడిగినచో సంతసించుచు దండ్రి యూరకుండునా? మరికొన్నిదినములు దేశము దిరిగివచ్చి తరువాత నడిగెదను. కాంతిమతి రాత్రి నాకొరకుబడినకష్టము తలంచుకొన్న విడిచిపోవుటకు నిష్టములేకున్నది. ఆ చిన్నదానికి జెప్పితినేని వెళ్ళుటకు సమ్మతింపదు. ఇచ్చటనుంటినేని క్రమముగా రాజుగారికి దెలియకమానదు. అప్పుడతని కెట్టిబుద్ధిపుట్టునో! కావున నిప్పుడు తెలియకుండ పోవుటయే యుచితముగానున్నది. అని యూహించి యొక యుత్తరమిట్లు వ్రాసెను.

కాంతా! నీవీరాత్రి జరిగించిన కృతమున కెంతేని సంతసించితిని. నీవట్టి యుపాయము పన్ననిచో నన్ను బట్టుకొందురు. నన్ను గురించి నీవు పొందిన యాయాసమునకు మిక్కిలి చింతించుచున్నవాడ. నీవు నాతో జెప్పినమాటలు జ్ఞాపకమున్నవి. నేను దప్పక పట్టమహిషిగా నిన్ను స్వీకరింతును. ఇదివరకే మన యిరువురకు గాంధర్వ వివాహమైనది. నా కులశీలనామంబులు నీకు జెప్పకపోవుటకు గారణమున్నది. ఇప్పుడు పేరు మాత్రము తెలియజేయుచున్నవాడ. నేను గొన్నిదినములు దేశాటనము జేసి మరల వచ్చెను నీవేమియు జింతింపకుము. సర్వదా తలంచుకొనుచుండము. ఈ చిత్రఫలకమును సంతతము నంతికమున నుంచుకొని నిన్నుగా భావింపుచుందును. స్వల్పకాలములోనే తిరుగవచ్చెద గ్రహింపుము.

ఇట్లు, అదృష్టదీపమహారాజు.

అని వ్రాసి యట్టి యుత్తరమును బలభద్రునిచేతికిచ్చి యోరీ! నే నిప్పుడే పోయి యూరిబైట నివసించియుందును. చతురిక యిచ్చటికి వచ్చును వచ్చినతోడనే యీ యుత్తరము మాత్రము దానికిచ్చి మరి యేమియు జెప్పక యది యా యుత్తరమును జదువుకొనులోపలనే దానికి దెలియకుండ బయలుదేరివచ్చి నన్ను గలిసికొనుము. మన మిక నీయూర నుండవలదనిచెప్పి యప్పుడే బయలుదేరి వానితో జెప్పిన సంకేతస్థలము