పుట:కాశీమజిలీకథలు -01.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భేరుండపక్షికథ

245

అతని పశ్చాత్తాపంబు బరిశీలించి యమ్మించుబోఁణి దేవా! కానిండు మించిన దానికి జింతింపనేటికి? ఇప్పుడప్పూఁబోణి నాస్వాదీనములోనే యున్నది. సెలవై నచోఁ బిలిపించెద ననుటయు నతండు సంతసించుచు నయ్యింతి కిట్లనియె. తరుణీ! యయ్యింతి యింతవరకు నిర్దుష్టురాలై యుండినచో వేగఁబిలిపింపుము. దానిపాదంబులంబడి తిరస్కారదోషంబు బాపుకొనియెదను. లేలెమ్మని తొందరపెట్టిన నమ్మత్తకాశిని యతని చిత్తవృత్తి యంతయు బరిశీలించి పశ్చాత్తాప తప్తమయ్యెనుగదా యని సంతసించుచు నిట్లనియె.

ప్రాణనాధా! ఆసుశీల నెచ్చటనుండియో తీసికొనిరానక్కరలేదు. ఇక్కడనే యున్నదిఁ పెక్కేల! నేనే యాసుశీలను. పూర్వజన్మ మందెద్దియో పాతకముచేసి యింతకాలము నీవంటిపతికి నయిష్టురాలనై తిని. మనదీర్ఘదర్శి తనపేరు సార్ధకము నొంద నింతకాలమువరకు నాకుధైర్యము గరపుచుఁ తుదకు మిమ్ము నాచెంతకుఁ దీసికొని వచ్చెను. ఇంతకును దైవానుకూలము వచ్చినది. మీరు చనిన పిమ్మట మీ తేజంబున నాకొకకుమారుం డుదయించెను. వానిరూపము, పరాక్రమము, గుణములు దేవతలకై నను లేవు. వాఁడు మంత్రి కొడుకుతోఁ గూడఁ గొన్ని దినముల క్రిందట నెచ్చటికో పోయెను. దానంజేసి చింతించుచుంటినని తన కథయంతయు దాచక చెప్పి కన్నులనీరు విడువజొచ్చినది.

అప్పుడతం డామెను గౌఁగలించుకొని యోహో! ఆసుశీలవు నీవేనా! తెలిసికొనలేకపోతినే. సాధ్వీ! చింతింపకుము. దైవప్రతికూలమువలననే నాకట్టి బుద్దిపుట్టినది. నీవిట్టి కష్టము లనుభవించుట దైవయుక్తి సుమీ! అన్నన్నా! ఇంతచక్కనిదానిని బ్రాహ్మణుఁ డెంతమాయచేసి మొగముజూడకుండ జేసెను? ఒకసారి చూచిన విడుదునా? అయ్యారే! గాలమంతయు వృధాపోగొట్టకొంటినే!నీప్రాయమంతయు నడవిపాలైనదేయని యడలుచు గుమారసందర్శనమునకుఁ జింతించుచు నప్పుడే యప్పడఁతి నచ్చటనుండి తన పట్టణమునకుఁ దీసికొనిపోయి మంత్రికి వర్తమానము బంపి యతఁడుచేసిన యుపకారము గుఱించి పెక్కుగతుల స్తుతించి యాసుశీల నొక చక్కని యంతఃపురములో బ్రవేశపెట్టి కుమారాన్వేషణార్ధంబు దేశదేశంబులకు దూతలంబంపెను.

భేరుండపక్షి కథ

గోపా! అచ్చట బుద్ధిసాగరుండును కామపాలుండును నిల్లు వదలి యడవిమార్గంబునం బడి నడచినడచి యొకనాఁటిరాత్రికి మధ్యార్జునమను రాజధాని జేరిరి. అందు విత్తముగైకొని యన్నమిడుచున్న యొక పెద్దమ్మ యింటికిఁబోయి పెందలకడ భోజనముజేసి పెద్దమ్మా! మేమీ వీథివేదికపై బండికొనియెదము. ఆప్తరణ