పుట:కాశీమజిలీకథలు -01.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

మంజు - అదియేకదా, నిన్ను మేమడుగుచుంటిమి. వారియెడ నీ కింతక్రౌర్య మేలకలిగినో దెలుపుము .

పురుష - వారి మొగము జూడకపోవుటయేగాక వారి తలంపుగూడ నా మది కసహ్యముగ నుండును.

మంజు – అయ్యో! వెఱ్ఱిదానివలెఁ బలుకుచుంటివి? మనతండ్రులు నన్నలు దమ్ములు బంధువులు మాత్రము మగవారుగారా? వారు హితులును పైవార లహితులునా ?

పురు - (చెవులు మూసుకొని) నాకందఱును సమానులే! నాకు జ్ఞానము వచ్చిన తరువాత నా తండ్రి మొగముకూడఁ జూడలేదు.

మంజు — అట్టికారణము చెప్పినంగాని విడువము.

పురు – నా తలిదండ్రు లడిగినను జెప్పినదానఁగాను. ఆ మాటలు నా కసహ్యము.

అప్పుడు పురుషద్వేషిణి బలవంతము మీద నిట్టు దనవృత్తాంతము జెప్పఁ దొడగెను.

__________

రత్నాంగి కథ

నాకు జాతిస్మృతి గలిగియున్నది. నేను పూర్వజన్మమునం దొకరత్నవర్తకుని కూఁతురను. నా పేరు రత్నాంగి. లేక లేక గలిగితిని. మా తండ్రి నన్ను గారాబముగాఁ బెనుచుచుఁ బ్రాయుమువచ్చినంత కాంతివర్మయను వైశ్యకుమారున కిచ్చి పెండ్లి జేసెను. నేనును బెండ్లియైన గొలది దినములకే, కాపురమునకు వెళ్ళితిని. నా మగండు మంచికుటుంబములోనివాఁడేకాని సహవాసదోసంబుననో పూర్వకర్మయంబుననో జూదరియై తిరుగుచుఁ గ్రమంబునఁ దాత తండ్రులు సంపాదించిన సొమ్మంతయుఁ గర్చుపెట్టఁ దొడంగెను. నేనును బెక్కుసారు లట్టిపని కూడదని బోధించితిని. నా బోధ వానియెడ నుపచరించినది కాదు. ఇంతటిలో ధనమంతయు వ్యయమైన వెనుక నొకనాఁడు జూదంబున దాకట్టుపడియున్న వానిని యొడలి నగ లిచ్చి విడిపించితిని.

అప్పటికైనను సిగ్గులేక నామెత్తతనము గనిపెట్టి నాకు మా తండ్రి యిచ్చిన సొమ్మంతయు నడిగి పుచ్చుకొని జూదంబున నోడిపోయెను. మఱికొన్ని దినంబులు ఋణముచేసి జూదంబాడెను. తుదకు దినఁగూడును గట్టవస్త్రమును లేక మొగము