పుట:కాశీమజిలీకథలు-12.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాతాళేశ్వరి కథ

105

ద్రేకమున నొక ప్రక్కగా నడచుచుండెను. దైవికముగా నామె కుడివైపుననున్న మహాబిలమార్గము ననుసరించి యతిరయమున‌ బోవుచుండ ముందు మణిఘృణులచే నబ్బిలము ప్రదీప్తమై కనంబడుచుండెను. ఆ దేజఃపుంజము గాంచి యామించుబోణి సమంచిత గమనమున నా భూగర్భముననుండి వెల్వడు నుపాయం బెరుంగవచ్చు నను నాసతో ముందరుగు చుండెను. డట్లబ్బిలమున నామె యెంత తడవు నడచెనో నుడువజాలనుగాని బడలికచే నొడలు దడబడువరకు బోయిపోయి యింక ముందరుగఁ జాలక నందొకచోఁ జదికిలంబడి వివశయై యంతలో చైతన్యము వడసి శ్రమంబపన యించుకొనుచుఁ గ్రింద శయనించియుండెను. అట్లామె విశ్రాంతిం బొందుచున్న సమయమున మాటిమాటికి నికటమున ఘంటారవము వినంబడ దొడంగెను. దాని కబ్బి బ్బోకవతి యబ్బురంబడుచు గొబ్బునలేచి యిటునటు బరికించుచుండఁ గ్రిందనుండి వెండియు శక్తిస్తోత్రపాఠకుల సందడి వినంబడెను. ఆ ప్రాంతముల యందెచ్చటనో దేవతాయతనమున్నదని గ్రహించి యా చంచలాక్షి యందేగి యమ్మవారి నభ్యర్థింప వలెనను నుత్సాహమున లేచి యబ్బిలము నర్గమింప నతిరయమున నడచుచుండ నెదుర గనకమయ గోపుర ప్రాకరములతో నొప్పుదేవతాయతనంబొండు నేత్రపర్వంబగు టయు నాముగుదలతలమానికము మురియుచు నచ్చటి కరిగినది.

అయ్యది పాతాళేశ్వరియని ప్రసిద్ధికెక్కిన యమ్మవారి యాలయము. దానిని దానింతకుముందెన్నఁడో చూచియున్నట్లు సంశయించుచు ననంగమోహిని తిన్నఁగా గర్భాలయముం బ్రవేశించెను. అందు దివ్య ప్రభావము దేటపరచుచు వెలు గొందుచున్న యా లోకేశ్వరిని గాంచి స్మృతినభినయించుచు నిట్లని సన్నుతింపఁ దొడంగెను.


మ. కలలోఁగాంచితిఁ దొల్లి నిన్ను వరముల్ గైకొంటి నత్యద్బుతో
     జ్వల మౌసత్పలమున్‌ గ్రహించితిని నమ్మచ్చీర్ష మందొప్పు ని
     ర్మల మాణిక్య మహా ప్రభావమును సర్వంబాను పూర్వ్యముగాఁ
     దెలియఁగాంచితి నీ దయన్‌ సతత మో దేవీ ననుంగావవే.

చ. వరుడతి సత్ప్రభావ బలవైభవుఁడబ్బెను నాకు నీ కటా
    క్షరససమప్రసారమునఁ వాని మదీయ విశేషదోష ని
    ష్టురమున వాని‌ బాసితిఁ గడుంగడుకష్టము లందుచుంటి ని
    క్కరణిన్ నన్నికన్‌ కరుణఁగావఁదలంపఁగదమ్మ ? యమ్మరో !

చ. చెనఁటియొకండు నబ్బలిమిచేత హరించి గుహాంతరము జే
    ర్చిన విధమెల్ల నెమ్మది నెరింగి భయమునఁ నబ్బిలము వెం