పుట:కాశీమజిలీకథలు-06.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

192

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

యావిద్య లాగి చెఱసాలలోఁ బెట్టినది. మామాట లేమియును వినక తన యిష్టమువచ్చినట్లుచేసి యవమానితుఁడయ్యెను. ఉత్తమ బ్రాహ్మణపుత్రునకు దాసీపుత్రికను బెండ్లి చేయుట యుచితమా యని పలుకుచు జలంధరునికి రోస మెక్కించిరి.

ఆ కథ విని యాతపస్వి నామాట విననందులకు వాని కీపాటి ప్రాయశ్చిత్తము కావలసినదే బోనిండు. దుష్టుఁడుశిక్షింపఁబడెనని యుపేక్షించిన విని వానితల్లి మిక్కిలి పరితపించుచు అయ్యో ? చిన్నతనమునే నేదియో యనెనని వాఁడు చెఱసాలలో నుండ నూరకుందురా ? ఇఁక మన నియమంబు లేటికి ? చాలుఁజాలు. వాని వేగమ విడిపించుకొనిరండు. అంతదనుక నేను భుజింపనని పట్టు పట్టినది.

ఆ తపస్వి అక్కటా ! నేనేమి చేయుదును ? నా‌ విద్య యొరులపీడకై బ్రయోగింపను. ఆ జాణ నా మాటలు వినివాని విడుచునా? కర్తవ్యమేమియని‌ యాలోచించుచున్న సమయంబున నతని శిష్యుఁడు తిమ్మర్సు మనుమఁడు రత్న పాదుఁడనువాఁడు గురునకు నమస్కరింపుచు నార్యా! మీరీ కార్యమునకై యిట్లు చింతింప నేమిటికి? నాకా గోకర్ణ విద్య నుపదేశింపుఁడు. ఆ రాచపట్టిని శిక్షించి మీ కుమారుని విడిపించి తీసికొని వచ్చెదను. అట్లు చేయనేని దిమ్మర్సు మనుమఁడగానని సాటోపముగఁ బలికెను. వాని బుద్ధిబల మంతకుముం దెరిఁగియున్నవాఁడు కావున నగ్గురుండు సంతసించుచు వాని కప్పుడే యా మంత్ర ముపదేశించి వత్సా ! నీకు మేముపాయములు చెప్పనక్కరలేదు. పరులు నొవ్వకుండఁ గార్యమును సాధించుకొని రమ్ము. పొమ్ము. అని దీవించి యంపుటయు నా రత్నపాదుండు శంతనాదుల నడిగి యా రాజపుత్రిక చరిత్ర మంతయుఁ దెలిసికొని వారి వెంటఁబెట్టుకొని యా పట్టణంబున కరిగెను.

శంతనాదులు వాని రూపురేఖా విలాసములును సాహసధైర్య గుణంబులును బరీక్షించి తప్పక వీఁడు రాజపుత్రికను జయింపఁ గలడని తలంచిరి.

రత్నపాదుని కథ

ఇంద్రజాలాది మాయా విద్యలకెల్ల నధకమైనది గోకర్ణవిద్య దానికిమించి మాయలులేవు. రత్నపాదుఁ డట్టివిద్య సంగ్రహించుకొని యప్పురముకు నరిగి మాయా బలంబున ననేక సేనలం గల్పించి భేరీ భాంకారాది ధ్వనులచే భూమి ------నట్లుఁ జేయుచు వాహినులా పట్టణము ముట్టడించునట్లు గల్పించెను.

ఆ యుపద్రవమునకుఁ బౌరులెల్లరు శిశుబాల వృద్ధముగా

హోర నరుబెంచినవని తఈంంచి వను సనల నొాయితను. నముంచినచె. కాని (“మం బూచిన నవవ శనంబచుచుండుట భంకించుకొని ముర 26