టక్కరిటమారీ కథ
183
యెనుబది యొకటవ మజిలీ
టక్కరిటమారీ కథ
అన్నన్నా ! ఆమె వైరులకు మారిగాని రాజకుమారి కాదు ! ఔరా ! ఎంతెంతవారి నెట్లు చేసినది. వంచకుల వంచించు నేరుపా పూబోణికే కలదు శబాసు. బాపురే ! కాంతిసేనా ! టక్కురిటమారీల నిరువురఁబొందఁ బడవేసితివిగదా ? అమ్మయో ? వాండ్రముందర లోకములు నిలుచునా ? మారీచసుబాహులు కన్నను నిల్వలవాతాపుల కన్నను నాముచ్చలు హెచ్చుమాయ రెరింగినవారు. అట్టివారిం బుట్టలోఁ బెట్టిన యారాచపట్టి శ్రీరామునికన్నను నగస్త్యునికన్నను నెక్కుడు బలశాలిని యని చెప్పనోపును. అని పొగడుచున్న వైతాళికుని మాటలువిని జంబుకుఁడనువాడు అన్నా ! టక్కరిటమారీలన వారెవ్వరు ? మారాజపుత్రిక వారలనెట్లు వంచించినది. ఆ వృత్తాంతముఁ జెప్పుమని అడిగిన నతండిట్లనయె.
జంబుకా ! కరభ శరభ శంతనులు రాజపుత్రికచే నవమానింపఁబడి ద్వీపాంతరమున కఱిగి యందు మహేంద్రజాల విద్యాపారంగతుఁడైన వీరసేనుఁడను రాజపుత్రు నాశ్రయించి వాని నిచ్చటికిఁ దీసికొని వచ్చిరి. అతండు విద్యచే నధికుఁడైనను నక్కలికి వలపులకుఁ జిక్కి తన విధ్య ధారవోసి చెఱసాలలోఁ నెట్టఁబడెను. నాఁడు జరిగిన వృద్ధరాజుగారి సంవత్సరీకోత్సవమునకుఁ గొందరపరాధులు చెఱసాలనుండి విడువఁబడిరి. విమర్శింపక నప్పుడు కరభ శరభ శంతన వీరసేనుల నలువురను విడచి వైచిరి. ఆ రాజపుత్రుండు తమ దేశముపోయి తండ్రితోఁ దనయవమానముఁజెప్పి దుఃఖించుచు నింద్రజాల మహేంద్రజాల విద్యకన్న నెక్కుడు మాయ ఎఱింగిన టక్కరిటమారీలను నిరువుర దొంగలఁ దమమిత్రుల రప్పించి యిట్లు వాక్రుచ్చెను.
మిత్రులారా ! నన్నొక రాజపుత్రిక నమ్మించి మిక్కి.లి యవమానపరచినది. మీ మాయా బలపరాక్రమములు లోకాతీయములు గదా? గోపురములను, గోడలును, గవాటములును మీ గమనమున కాటంకముఁ గలుగఁ జేయనేరవు. మీరు తలంచితిరేని నెట్టి రహస్య స్థలమందలి వస్తువులనైనను దీసికొని రాఁగలరు. మీరు బోయి యారాజపుత్రిని బట్టుకొని రెక్కలుగట్టి నా యొద్దకుఁ దీసికొని రావలయును. ఇదియే మీరు నాకుఁజేయు నుపకారము. అది కడు మాయలమారి, పెండ్లి యాడెదనని వలపులు చూపి మగవారినెల్ల వలలో వైచుంజుడీ ? ఆ మాట లేమియు వినక యిక్కడికి లాగికొనివచ్చుటయే కర్జము అని తదీయ కుల శీల నామంబులన్నియు ---------------- వాండ్రు గాండ్రుమని యర్5అచుచు నిట్లనిరి.
మాకిది యెంతపని ? మీకీపాటి యుపకారము చేయనిచో మా