Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

తప్పుగా గణింపక మీరు మా సమాజములోఁ జేరితిరియేని మాకును మంచివాఁడుక రాగలదు. మీ సంగీత సాహిత్యములకు వెన్నె వెట్టినట్టగును. మాకును జాల నుపకారము కాఁగలదు. మేము సమాజముతోఁ గాశీ ప్రయాగాది పట్టణములఁ దిరుగుదుము. మీ కయ్యెడు వ్యయ ప్రయాసము లన్నియు మేము భరింతుము. అంగీకరింతురా ? అని యడిగిన నతండు నవ్వుచు నిట్ల నియె. మాకు నాటకములనినఁ జాల వేడుక యున్నది ? మీరు కోరితిరి కావునఁ గొన్నిదినములు మీతోఁ దిరిగి మా యోపిన సహాయము చేయుదుము. మేము వేతనము లందువారముకాము. కావలసిన నాటకములు రచించి యిచ్చుచుందుము. అవసరమున్న భూమికల ధరింతుము. నా మిత్రుని వెదకి తెప్పింపుఁ డతండు నాకన్న మిక్కిలి చక్కని వాఁడని చెప్పిన సంతసించుచు మేఘనాధుఁ డప్పుడే యతని వెదకి తీసికొనిరమ్మని పెక్కండ్రఁ బరిచారకులఁ నంపెను. వాండ్రు నాఁటిమునిమాపుదనుకఁ దిరిగివచ్చి యట్టివాఁ డెందును గనంబడలేదని చెప్పిరి.

అందులకుఁ బరితపించుచుఁ గృతవర్మను మేఘనాధుఁడు కాశీ రామేశ్వరముల నడుమ నెందున్నను నీ మిత్రుని వెదకి తెప్పింతుఁ జింతింపవలదని యూరడించెను. కృతవర్మకు నప్పటికి వేరొక తెరవులేక వారియింటనే వసించి తత్కృత సత్కాలముల కానందించుచుఁ గొన్నిదినములు గడపెను. మేఘనాధుఁడు సమాజస్తులతో స్త్రీ భూమికాధారి నొకదైవము తీసికొని వచ్చెను. అతని రూపము త్రిలోకాభిరామము. కంఠమా ! కిన్నరము. దేవగానము. పాండిత్యమా ! బృహసృతి. కవిత్వమా ! కాళిదాసు. అతండు వేషము వైచినప్పడు కాంచన వర్షము కురియగలదు. మనమిఁక బయలుదేర వచ్చును. కొరంత తీరినదని యుబ్బుచు ముచ్చటించెను. సమాజమువారందరు డెందములఁ బరమానందభరితులై పయనంబున కనుమతించి నాటక లోపముల సవరించుకొనుచుఁ గొన్నిదినము లాల సించిరి.

వినత కథ

గానాభిజ్జుండు విరూపుండైనను దరుణులు వలతురను వాడుకయున్నది. తొల్లియొక రాజపుత్రిక వానరముఖుండుగా శప్తుఁడైనను గాన విద్యా విశారదు నారదు వరించినకథ లోకవిదితమేగదా? అట్టివాడుఁ లలితుండ్రైనఁ బలుకవలసినదేమి ? ఆ మేఘనాధునికి వినత యనుకూతురు కలదు అక్కలికయక్కజంబడు చక్కఁదనంబు ననవద్యమగు విద్యయుంగలిగి తొలి ప్రాయంబున నొప్పచున్నది.. మేఘనాధున కొక్కరితయే పుత్రికయగుట నపురూపపు ముద్దునం బెనిచి యొక సామాన్యున కిచ్చి పెండ్లిఁజేసి యల్లు నింటనే పెట్టుకొనియెను. అధికుండైన యల్లుఁ డిల్లరికముండ వాల్గంటులు పుట్టింట నుండినప్పు డిల్లరికపుటల్లునిఁ జులకన జూడకమానరు. నాటక