పుట:కాశీమజిలీకథలు-05.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

337

ములు మనకు వియోగంబు గలిగె. ఇప్పుడు త్వద్విరహదుఃఖప్రమాదమైన శూద్రకనృపశరీరమును విడిచితిని. ఇఁక నీకు సుఖముగలుగును. నీ ప్రియసఖి మహాశ్వేతయొక్క ప్రియుండు సైతము నాతోఁగూడ శాపవిముక్తి వడసె. నప్పఁడతియు సుఖించునని పలుకుచున్న సమయమందే నాగలోకమునుండి కపింజలుని కైదండఁ గొని పూర్వము మహాశ్వేత చూచినరూప మాకంఠమాల యాయక్షసూత్ర మాశాటీపటముతోఁ బుండరీకుఁ డచ్చోటికి వచ్చెను.

అప్పుడు దూరమునం దతనింజూచి కాదంబరి చంద్రాపీడుని వక్షమునుండి లేచి యతివేగముగాఁ బరుగిడి మహాశ్వేతను గౌఁగలించుకొని తదాగమనవృత్తాంతమును జెప్పెను.

అంతలోఁ బుండరీకుఁడును జంద్రాపీడునిచెంతకు వచ్చి యాలింగనము చేసికొనియెను.

చంద్రాపీడుఁ డతని బిగియఁ గౌగలించుకొనుచు, వయస్యా! పుండరీకప్రాగ్జన్మసంబంధంబున నీవు నా కల్లుడ వైతివి. ఎట్లయినను మనము తదనంతరజన్మసంబంధసముపగతమైన మైత్రిచేతనే వర్తింపఁదగినదని పలుకుచున్నసమయంబునఁ గేయూరకు డావార్త జిత్రరథహంసుల కెఱింగింప హేమకూటమునకుఁ బోయెను.

మదనలేఖయు వేగముగాఁబోయి యా ప్రాంతమునఁ దాపసవృత్తితో మృత్యుంజయ జపముచేయుచున్న తారాపీడుని పాదంబులం బడి చంద్రాపీడుఁడు జీవించిన వృత్తాంతమును జెప్పెను.

ఆ మాటవిని తారాపీడుఁడు విలాసవతితోఁగూడ నానందసాగరమగ్నుండై యత్యాతురముగా లేచి శుకనాశుఁడు తోడరాఁ మదనలేఖ వెంటఁ జంద్రాపీడుఁ డున్నచోటికిఁ బోయి యందు బుండరీకునిమెడఁ గౌఁగలించుకొనియున్న కుమారునింజూచి నానందబాష్పములు నేత్రంబుల గ్రమ్మ నపారసంతోషపారావారంబున మునుంగుచుఁ బుత్రుం గౌఁగిలించుకొనియెను.

తల్లియుఁ బాలిండ్లు స్రవింపఁ దనయుం జూచి సంతోషవివశయై యుండెను. అప్పుడు చంద్రాపీడుఁడు దల్లిదండ్రులకు నమస్కరించుచు శుకనాశునికి సైతము గేలుమోడ్చి యతని యాశీర్వాద మందుకొనుచు ఆర్యా! వీఁడే వైశంపాయనుఁడు చూడుమని పుండరీకుం జూపెను.

ఆ ప్రస్తావములోనే కంపిజలుఁడు సమీపింప శుకనాశుని కిట్లనియె.

ఆర్యా! శ్వేతకేతుండు మీ కిట్లు చెప్పమనియె.

ఈ పుండరీకుఁడు నాచేతఁ బెంపఁబడుటయే గాని నీకే పుత్రుండు. వీనికిని