పుట:కాశీఖండము.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

465


సీ.

జిలుఁగుసంధ్యారాగచీనాంబరము గట్టి
        కుసుమగర్భపుఁ గీలుకొప్పు తనర
కస్తూరితోఁ గూర్చి గంధసార మలంది
        ముత్యాలతాటంకములు ధరించి
సీమంతపథమునఁ జేర్చుక్క సవరించి
        కురులపైఁ జిన్నిపూ గుస్తరించి
శ్రీపాదముల హేమనూపురంబులు దాల్చి
        కటిమీఁద వజ్రాలకమరు నిల్పి


తే.

యన్నపూర్ణ విశాలాక్షి యనెడు పేళ్లఁ
గాశికామధ్యశృంగాటకములయందు
విశ్వపతిదేవి మధ్యాహ్నవేళఁ బెట్టు
నమృతపాయసదివ్యాన్న మనుదినంబు.

148


తే.

మనము మనమనపూర్వజన్మములయందుఁ
గడపినారము మధ్యాహ్నకాలభిక్ష
యనుభవింపక పోవంగ నలవి యగునె
కమలజుని కైనఁ బ్రారబ్ధకర్మఫలము?

149


క.

అందఱు భుజంగభూషణు
[1]లందఱునుం గాలకంఠు లందఱు గిరిశుల్
అందఱు ధృతేందుకళ లా
నందవనీనగరనివసన స్థిరులు నరుల్.

150


తే.

బ్రహ్మలోకంబు గాశికి బడిసివాటు
విష్ణులోకంబు గాశికి వినిమయంబు

  1. 'లందఱును ద్రిశూలపాణు లందఱును గిశో, రేందూత్తంసులు' అని పా.