Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇకారవళి నిరూపణము

ఆ.

ఇనజుఁ డీగి, భారతీశుండు చతురత,
నేకవీరుఁ డాజి ఋజుతయందు,
[1]ౠజరిపుఁడు సిరి, నహీనుండు భూవహ
నమున [2]విశ్వమనుజనాథవిభుఁడు.

34

ఉకారవళి నిరూపణము

క.

ధరణీవరాహలాంఛితుఁ, డురరీకృతసకలవిద్యుఁ డూరీకృతసం
గరజయుఁడు విశ్వభూవరుఁ, [3]డురుకీర్తుల నెగడు [4]నా బిడౌజోనిభుఁ డై.

35[5]

వర్గవళి నిరూపణము

క.

[6]తుది నున్న ఙ ఞ ణ న మ ములు, వదలిన యా [7]క చ ట త పల వర్గాక్షరముల్
[8]వొదిఁ దనవంగడములలో, నదికిన నవ్వళులు వర్గజాఖ్యము లరయన్.

36


సీ.

కమనీయరాజశిఖామణి కరిరాజగగ్వమహీధ్రనిర్ఘాతమునకు
[9]చతురయశస్సితచ్ఛత్త్రి [10]కాయోధనజయదాశ్వభంజళీఝంపునకును
టంకితరాయకఠారిసాళువునకు డంభలాంఛిన[11]కోలఢాలునకును
తత్త్వపురాణకథారసవేదికి దానదయాధర్మధామమతికి


తే.

పశుపతిప్రాప్తసామ్రాజ్యఫలున కబ్జ
బంధుబంధుర[12]తేజోవిభాసునకును
విశ్వవిభునకు సరి లేరు విశ్వజగతి
ననిన నివి వర్గవళ్లకు నచ్చు గృతుల.

37

కాదివర్గమునకు గుణితస్వరవళి నిరూపణము

క.

కా కై కౌ లట కత్వము, కీ కేలు [13]కృ కౄలు నట్లె, కిత్వము వళులై,
కూ కోలు [14]కుత్వమునకును, జేకొను [15]దత్కాదిళాంత[16]సిద్ధార్ణతతిన్.

38

ఇతరేతరవర్గజవళి నిరూపణము

క.

ఇతరేతరవర్గజవళి, తతికిఁ జవర్గువును శ ష స దగు నొకగమి యై;
కృతులకు న హయ లు నేక, స్థితి [17]నొకవంగళము; [18]న ణ లుఁ జెలఁగు నొకటియై.

39


చ.

చతురచళుక్యవిశ్వవిభుశాసన మెక్కినరాజమౌళు ల
చ్ఛత మకుటోజ్జ్వలస్రగనుషక్తము లై విలసిల్లు నెందు; నీ
జతనము నీతిమంతులకు సాగిన నేమి కొఱంత? సంతతో
జ్ఝిత[19]మదబుద్ధులుం గుశలసిద్ధులు [20]పొందుట లెల్లఁ బోలవే.

40


ఆ.

[21]చతురుపాయబహుశక్తిక్షమావళిఁ
బాఱ విడిచి చిత్రభానుసాక్షిఁ

  1. క. ఋక్షవిభుఁడు
  2. క.గ.చ. విశ్వమనుజనాథుఁ డెపుడు
  3. గ.చ. ఉరుకీర్తుల వెలయు
  4. క.గ. ఆబిడౌజనిభుండై
  5. విచారించేది పద్యాన గల సిద్ధి—
    క. తానంతబులను వరుస
       నౌనంచుంబలికె నియ్య(గాని) యచ్చేనియు హ
       ల్లేనియుఁ జెప్పమి పూర్వా
       నూనానుమతంబున వళు లుభయముఁ జెల్లున్.

    35వ పద్యముతరువాత నీపద్యము రెండుప్రతులలో నధికముగఁ గన్పట్టుచున్నది.

  6. క.గ.చ. తుదనున్న
  7. క. కచటతపలు వర్గాక్షరముల్
  8. క.గ.చ. పొది తమవంగడములలో
  9. క. చతురకీర్త్యతిసితచ్ఛవి, గ.చ. చతురకీర్తివిహితచ్ఛవికి
  10. క.గ.చ. ఆయోధనజయదాశ్వభంజరీ
  11. గ. కోలఠాలునకు
  12. క.గ.చ. తేజోవిభాసురునకు
  13. క. ఋఋల డాసి, గ.చ. ఋౠలఁ బాసి
  14. క.గ.చ. కుత్వమునకృతి
  15. క. తత్కాదిభాంత, గ. తత్కాదిఱాంత
  16. క. సిద్ధాంతతతిన్
  17. క.గ.చ. ఒకవంగడము
  18. క.గ.చ. నణలు చెలు వొక్కటియై
  19. క.గ.చ. మదబుద్ధులం
  20. క.గ.చ. పొందుటలెల్లఁబొల్లవే
  21. క. సమముపాయ, గ.చ. ససముపాయ