Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సాలం దెల్లనిచాయలం దనరు, నాశాదంతు లంతంతకున్
గాలాకారత నుజ్జగించు ననుచుం గాంక్షింతు రత్యుక్తులన్.

45

గూఢచతుర్థము

క.

మొదలిచరణత్రయములోఁ, బదిలముగాఁ [1]గవిత నంత్యభాగాక్షరముల్
గదియం గ్రమమున నిల్పిన, నది గూఢచతుర్థ మనఁగ నద్భుత మయ్యెన్.

46


చ.

[2]చతురుఁ బరార్థ్యశీలుఁ గవిశశ్వ[3]దభీప్సితభూరిదానదున్
వితతిభుజానిసర్గబలువిక్రమసన్నుతిసేవితోదయున్
మతి కెదు రెల్ల సేసికొని మాన్యుల కాలము కాని మానులై
చతురులు విశ్వభూవిభుని సన్నుతి సేయుకు రెల్లకాలమున్.

47

చతుర్విధకందము

తే.

ప్రథమకందంబు రెండవపాదయుగము
నందు రెండవగణవర్ణ మాది గాఁగఁ
గడయు మొదలును వరుసతోఁ గలిపి చదువ
నగుఁ జతుర్విధకందమై యార్యసభల.

48

మొదటికందము

క.

చాళుక్యవిశ్వవిభునకు, వాలున్ బుధనుతియు సుగుణవర్గము నిధులున్
జాలుటయు నీతినిరతియు, మేలున్ మధురతయు నీగి మీఱినవిధమున్.

49

రెండవకందము

క.

బుధనుతియు సుగుణవర్గము, నిధులుం జాలుటయు నీతినిరతియు మేలున్
మధురతయు నీగి మీఱిన, విధముం జాళుక్యవిశ్వవిభునకు వాలున్.

50

మూఁడవకందము

క.

చాలుటయు నీతినిరతియు, మేలును మధురతయు నీగి మీఱినవిధమున్
జాళుక్యవిశ్వవిభునకు, వాలుజ్ బుధనుతియు సుగుణవర్గము నిధులున్.

51

చతుర్థకందము

క.

మధురతయు నీగి మీఱిన, విధముం జాళుక్యవిశ్వవిభునకు వాలున్
బుధనుతియు సుగుణవర్గము, నిధులున్ జాలుటయు నీతినిరతియు మేలున్.

52

—————

పంచవిధవృత్తము

క.

సరసిజముఁ గందయుగళము, సరి మొదలినవాక్షరముల సమవృత్తముఁ, ద
త్పరమున మణిగణనికరము, వెరవున రచియింపఁ బంచవిధవృత్త మగున్.

53
  1. క.గ.చ. కవితనంత్యపాదాక్షరముల్
  2. క.గ.చ. చతురుఁ బదార్థశీలు
  3. గ.చ. అభీహితభూరిదానదున్