పుట:కామకళానిధి.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తనదోషము దాచును పర
జనదోషము సంగ్రహించు సంతతము మదిన్
తను వతిదృఢమై తగునది
వనదేశోద్భవలతాంగి వర్ణింపఁదగున్.


గీ.

నేర్పుగలయది శుభవేషనియతి గలది
భోగములఁ బ్రీతి గలయది పొందునపుడు
నులువునగఁరంగు జక్కని చూడ్కి గలది
ధనము లార్జించు గుజరాతితరుణి దలఁప.


గీ.

బహువిధములైన భోగము ల్పరగ రతిని
చతురయై కూడుఁ గడుసంతసము నొంది
ప్రియున కుత్సాహము నటించఁ బ్రియము గలది
మతి రహించనె సాగరానూపకాంత.


గీ.

సతతసంభోగచతుర లజ్జాసమేత
మది నలంకారములఁ గోరు మంచిరూపు
గోరును బ్రచండవేగంబు గుణముఁ గలది
చెలులమేటి త్రిలింగదేశీయకాంత.


గీ.

మెత్తనైనమేను మిగులసాహసమును
గొంచమైన రతియు మంచిపలుకు
కలుగునండ్రు వెఱపు గలుగదు పశుతుల్య
బరవసతులు లజ్జ యెఱుఁగరండ్రు.