పుట:కామకళానిధి.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

సాధనల నేర్పు జూపుచు జలజనేత్ర
వెనుకభాగంబులకు నీడ్చి వేగగతుల
గదిసి రమియించిన నిఘాతకం బనంగ
కరణమగు శాస్త్రసరణి విఖ్యాతి మీర.


క.

తరుణీమణి తనపదముల
గరముల గూడంగ జేర్చి కడువంగినచో
మురవైరి నిలిచినిలిచియు
బిరుదన్ రమియింప చకటవిలసిత మయ్యెన్.


క.

పడతిపిరుందులపై దన
కడు పానిచి చంద్రవదన కడుపున గరముల్
కడుబిగియ గూర్చి గదులక
నడరన్ రమియింప బుష్ప మన జెలువొందున్.


క.

చెలువుం డూరక వెనుకన్
నిలుచుండగ బడతి దాను నెమ్మేని న్ముం
గలికి న్వెన్కకు ద్రిప్పుచు
గలసిన విపరీత మనగ గరణం బయ్యెన్.


క.

వనితపిరుందుల గృష్ణుఁడు
తనచేతుల బిగియబట్టి తద్దయు వేగం
బొనరగ గ్రిందుగ దాకున్
గనకుండ వరాహఘాతుకం బనబరగున్.