23
ద్వితీయాశ్వాసము
భువనత్రయజిగీషు పుష్పేషుచాపటం కృతియనఁ బికనాద మెగసె దిశల మహితవనరమాఝుల్లరీమౌక్తికంబు లనఁగఁ బాండురనవకోరకాళి దనరె నమితదోహదధూపధూమ్యాంబువాహ వృష్టి యనఁగను మకరందవృష్టి గురిసె.
పథికవియోగాగ్నిపాణింధమంబులు ప్రాసనామోదధురంధరములు గురుసరశ్శీకరకుక్షింభరులు లతి కాబాలికాడోలికాకలనలు చైత్రభూమికళత్రచామరచలనము ల్కాముకసౌభాగ్యకండళములు పటుఘర్మజలకణపశ్యతోహరములు మందగామిత్వసంపద్గజములు ఫుల్లకాననమల్లికావల్లికామ తల్లికావేల్లితనికుంజతతులఁ దాఱి వలపు మెలపునఁ గొలుపుచుఁ బొలసె నపుడు గంధగిరిగంధవాహస్తనంధయములు.