పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11

ద్వితీయాశ్వాసము

సీ. అనిపెనా యే మిచ్చె ననుచును సంభ్రమం
                        బున సందడించుచు మూఁగువారు
    సర్వేశ్వరుండు శ్రీసతితోడ గానంబు
                        వినునఁట యడుగనే లనెడువారుఁ
    గడు ననుగ్రహము నెక్కడ లేనియీయీగి
                        పసయుఁ దెల్పెడు నంచుఁ బలుకు వారు
    నీ వొక్కఁడవొ మఱి యెవ్వార లైన న
                        య్యెడ నుండిరో యని యడుగువారు

ఆ. నగుచు సురలు మునులు నరుదంద మేపూఁత
    డంబుతోడ వచ్చెఁ దుంబురుండు
    కడలవారిని గనకస్నాన మాడించు
    పదకమును సునేత్రపటముఁ దాల్చి. 82

వ. అప్పుడు, 83

క. ధగధగ యనుపదకంబున
   నిగనిగ యను క్రొమ్మెఱుంగునేత్రపటమునన్
   భుగభుగ యను మేపూఁతన్
   భగభగ యనిపించె నతఁడు. నాహృదయంబున్. 84

సీ. తనుఁ గ్రమ్మఱంగఁ బిల్చిన వేళయంద నా
                          తో విచారింపక పోవు టెట్లు
    పోయెఁబో ననుఁ బిల్వఁజేయక తా నొక
                          నెఱజాణ యై విద్య నెఱపు పెట్లు