పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

75

ద్వితీయాశ్వాసము

   
   సీ. బృహతీసమాఖ్యతోఁ బెంపు మీఱెడువీణె
                     వహించి యెపుడు విశ్వావసుండు
      జగతిఁ గళావతిసంజ్ఞ నొప్పెడువీణె
                     తోడ నేప్రొద్దును దుంబురుండు
      మహతీసమాహ్వయమహనీయ మీవీణె
                     మానక నిత్యంబుఁ బూని యేను
      గచ్చపి యను పేరఁ గరము శోభిలువీణె
                     సవరించి జగదంబ శారదయును
   
   గీ. బాయ కెంతయుఁ బాటించుభంగు లరయ
      విద్యలం దెల్ల సంగీతవిద్య మిగుల
      నుత్తమము గాదె యది పురుషోత్తమునకు
      నర్పితం బగునేని యే మని నుతింతు.63

  ఉ. నీదుకృతార్థతామహిమ నెమ్మది నెన్నఁగ నంతయింత నా
      రాదు తపంబులం గనఁగ రానిజగత్పతి కృష్ణుఁ డెట్టిభా
      గ్యోదయశాలికిం దొరకు నుల్లమునం బరికించి చూడు మా
      శ్రీదయితుండు నీకుఁ గృపచేసెఁ గురుం డయి గానసత్కళల్.64

   క. కావున నీవిద్య సదా
      యావర్తింపుము కుమార యది సకలాభీ
      ష్టావ్యాప్తికిఁ గారణ మిం
      పావహిలం జేయు నప్పు డటు మనమునకున్.65