పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

కళాపూర్ణోదయము

  
    నదియుఁ దన్మహిమకు వెఱఁగందుమనము
    నల్ల నూల్కొల్పి యర్ఘ్యపాద్యాదు లొసఁగె. 51

గీ. అతఁడు నోకలభాషిణి యాత్మగురుని
    గృష్ణుఁ గొలువఁగ నేఁగుదే గీతవిద్య
    పూర్ణముగఁ నేర్చితే రాక పోక లిపుడు
    మానినాఁడుగదా దివ్యమౌనివరుఁడు. 52

క. దానం జేసియు నీకును
    మానస మితరప్రచింత మాని తిరముగా
    నానలకూబరునంద య
    ధీనం బై నిలిచియున్నదియై, తరళాక్షి. 53

చ. కడపటినాఁడు నిన్ను నిటు కాంచనగర్భతనూజుఁడంపుచోఁ
    గడమయభీష్టసిద్దియును గాఁ దగుదీవన యిచ్చెఁ గావునం
    బడఁతి యమోఘ మాయనముపు చలింపఁగనీకుతాల్మి నీ,
    బడలుట చూడ నోపుదురె ప్రాణసఖుల్ క్షణమాత్రమేనియున్ 54

సీ. తడవులనుండియుఁ దపము సేయఁగఁ బూని
                      మణికంధరుఁడు పాట మాని యునికి
    నుపవాసభేదంబు నపనయింపఁగ లేక
                      వ్రేఁగుచున్నవి నాదువీను లిపుడు