పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330

కళాపూర్ణోదయము

గీ. వీఁడు నీ రూపుషసఁ జిక్కి వెంట వెంట
వచ్చు నెలయించికొని పొమ్ము వాసికడకు
నెంత విసివియు నీమీఁద నించుకయును
దెగఁ డితఁడు డెందమున నీవు బెగడవలదు.59

వ. ఇమ్మహాఖడ్గంబుఁ దొల్లి దత్తాత్రేయుండు స్వభావ నామ ధే
యుం డగుసిద్ధున కిచ్చె నతండు మణి స్తంభుం డ: తనయల్లుని
కిచ్చె నతండును నిక్కడ నొక్క ప్రయోజనంబుల కొఱకు గం
ధర్వుం డైనమణికంధరున కిచ్చె దానం జేసి యిద్దివ్యాయుభio
బమ్మణికంధరునకు సంప్రదాయాగతం బగుచుఁ గార్యకారి
యగు నితరులకుం బనుపు సేయదు గావున నతని చేతిక యీ
వలయు నతండు నిప్పుడు శ్రీ శైలంబున నొక్క. శాపంబు "కార
ణంబుగా భృగుపాతంబున 'కాయ త్తపడుచున్న వాఁడు నీవు
వేగంబ చని తత్ఫలుబు దీని చేత నే యౌనని దూభృగుసా
తంబు మాన్ని యిద్దానవువధంబునకు నియోగింపు మాగం
ధర్వుండు రెండవ మేనఁ గళాపూర్ణుం డనం గాసొర నామధే
యం బగుపట్టణముఁ బుట్టఁగలు డతని వరియించి నీ ప్రతిజ్ఞ
చెల్లించుకొనుము పొ మ్మని యమ్మహాసి చేతి కిచ్చి యనిపిన 60

చ. పయఁట బిగించి నెన్నడుము పైఁ బిరిచుట్టుగఁ జుట్టి కుంతలో
చ్చయము దృఢంబుగా ముడిచి చయ్యన నచ్చటి మండలాగ్ర
మున్ ,శయమునఁ బూని వెల్వడియె శక్తినివాస మవక్రవి
క్రమో,దయపరి భాసమాన యగుదర్పక వైభవలక్ష్మి యో
యనన్,61