పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

101

ద్వితీయాశ్వాసము

   బంగారువలువున రంగారుకటిమీఁదఁ
             జక్కఁగా నొక్కహస్తంబు చాచి

గీ. యన్యకరయుగ్మమునఁ బాంచజన్యమును సు
   దర్శనంబును దాల్చి సుదర్శనమున
   నచటిజనములచూడ్కి ధన్యముగఁ జేయు
   శార్ఙ్గపాణిని గొల్చె నుత్సవ మెలర్ప. 158

వ. మఱియు నందు కుంభేశ్వరుని సేవించి దర్భశయనంబున కరిగి యందు రామభద్రు నిర్ణిద్రభక్తి
    తాత్పర్యంబుల సేవించుచు వీణా వాదనానువాద మేదురగానకౌశలంబుతోడ నిట్లని స్తుతించె. 159

తురగవల్గనరగడ.



    దశరధానీశవిమలతరతపఃఫలావతార
    నిశితశరలఘుప్రయోగనిహత తాటకావిహార
    కపటపటుసుబాహుదళనఘటితగాధిసూనుయాగ
    అపరిమేయగౌతమాంగనాఘదమనపదపరాగ
    కోమలేక్షుదళనసదృశఘోరశంభుచాపభంగ
    భూమిజావివాహవిభవపూర్ణసమ్మదాంతరంగ
    పరశురామగర్వపవనపానపీనబాహునాగ
    గురువచోనుపాలనాతికుతుకవిధుతరాజ్యభోగ
    పదభజనవితరణాతిఫలితగుహసమస్తపుణ్య
    పాదుకాప్రదానవిహితభరతసౌహృదానుగుణ్య