తృతీయాశ్వాసము 715
తే.కృపుని రావించి తనఁబరీక్షితుని నతని,
కొప్పగించి కరమ్మును గొప్పచేసి
పుడమి నేలంగ సభిమన్యుకొడుకు నిలిపి,
జన్నిగట్ల కొనర్చి చాగములను. 150
క.బాపండొక్కఁడు కవ్వడి, దావునకు నచ్చి విల్లు తడయక నీవీ
ఱేపకడనే విడువుమన నా పగిదిని గాండివంబు నతఁడిడెఁగడలిన్.
సీ.రాచఱికంబున రహిఁబరిక్షితుఁబెట్టి
ప్రోలివారల వీడుకోలు వడసి
చిత్రాంగదను బిడ్డ చెంతకుఁ బంపించి
వడి నులూచిని దండ్రికడకుఁబంపి
ద్రోవాదిఁదమతోడఁదోడ్కోని పయనమై
పొరిఁబాండుకొమరు లేవురునుగదలి
కానలఁబడి మెల్లఁగాఁజనుచుండంగ
వేపియొక్కటి వారివెంటఁబడియె
నంత దహయు నాఁకలి చూడ కరుగవారు
కాఱుకానలలో పలగండ్లు ముండ్లు
గాళ్ళఁదవులగంబడలిక గదిరి మిగుల,
వెనుకఁబడిసోలిద్రోవదివిడిచెమేను. 152
సీ.బడలిక కడలు తోడ్పడ వెనరాలేక
సహదేవుఁడొకచోటఁజచ్చిపడియెఁ
దమ్ముఁడు చావంగ ఁదడఁబడి కాళ్ళాడ
కొకచోట నకులుండు నొఱగి కూలి
మూపురపాటును బోవుచుఁదిలకించి
యెదవ్రయ్యఁగవ్వడి యెదుర నీల్గెఁ
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/719
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది