పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/6

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రత్నములు. అప్పట్లో హిందూదేశ బంధువైన రిపన్ ప్రభువు గురించిన పొగడ్త - 'శ్రీ రిపన్ ప్రభు స్వాగతము'. అందులో కర్త రిపన్ నీ, ఆయన్ని పంపినవారినీ కూడా కీర్తన చేశారు. దేవుడు-తనవారు-మంచి బాలుడు-విద్య-అడకువ-గర్వము-తృప్తి-ధైర్యము-సత్యము-జీవహింస-సర్వజన సమాదరము-పాటుపడుట-శరీరారోగ్యము-స్వతంత్ర జీవనము-ధనము-ముఖస్తుతి-పనిబనుచుట-చౌర్యము-పరోపకారము-వివిధ ధర్మములు - అనే ఉపశీర్షికల క్రింద నూఱు గీతాలలో ప్రకాశిస్తూ బాలకంఠాల్లో మెరసిపోవాలని వీక్షిస్తూండే రచన 'నీతి దీపిక'.


రాజమండ్రి. 25-6-1950. భమిడిపాటి కామేశ్వరరావు.