పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమశ్వాసము


లిటులువేల్పులదొంతియైయెసఁగుచున్న
కొమరుఁబాయంపుముద్దియఁగూడఁగల్గు
మేలుసమకూడెంనేని యోనేలఱేఁడ
కోరు కోరికలెల్లఁజేకూఱుటరుదె.

గీ. తలిరులింతియొడలిమెత్తతనముకోడి
యొడలులేనట్టివానికే యూఁచలయ్యొఁ
దొడరియేనుంగు లెలనాగ నడకకోడి
నడకతప్పిన కొండలకడనుజేరె.

సీ.వాలుమించును మించువాలును నడలించు
               మెలఁతుకకందొయి మెఱుఁగుటారు
వింటిబెళ్కును బెళ్కువింటినినడలించు
              నాతుకకంబొమల్ నడుమతీరు
తమ్మికెంపును గెంపుఁదమ్మినినదలించుఁ
              బడఁకవాతెఱయడుగుదొయి
మెఱుఁగుబంతిని బంతిమెఱుఁగునునందలీంచుఁ
               గన్నియనెమ్మెనుఁజన్నుదొయి

  వెలఁదిసొయంగబేమని విన్నవింతు
నచ్చరలయందు జక్కులమచ్చెకంటు
లందుఁజిలువారకన్ని యలందు నెంచు
గనియ వినియునెఱుు౦గనీకలికికీడు.


ఉ.చందురుమామ తమ్ములను జామమొగంబునిబోలముందుగాఁ
గందును మేడ్పుఁబాపుకొన గాల్కొనితామరసొటివచ్చె నె
మ్మిం దగ వేఁడివేల్పు నెఱమొప్పల నిల్కడలెకకుండు నా
చందురుఁడువచ్చుటకుఁ జాలక మారుతఁడయ్యె దానికిన్.