పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చదువరులకు విన్నపం

'అమ్మనుడి'కి మూడు నెలల విరామం

తొలుత 'నడుస్తున్న చరిత్ర '... తర్వాత 'అమ్మనుడి.' 1993 డిసెంబర్‌ సంచికతో మొదలైన నడుస్తున్న చరిత్ర ప్రయాణం 2013 అక్టోబరుతో ఆగింది. మళ్ళీ 2015 మార్చి నెల నుండి ఆ ప్రయాణం సాగింది. అయితే, అక్కడి నుండి 'అమ్మనుడి ' పేరుతో!

నడుస్తున్న చరిత్రను మొదలు పెట్టినప్పుడు అది ఒక సామాజిక, రాజకీయ, విశ్లేణల సమాహారం. ఆలోచనను ప్రేరెపించే మేధోపరమైన పత్రిక. కాలం గడిచేకొద్దీ అది ఒక సమగ్ర సామాజిక ఉద్యమ ప్రాతినిధ్య రూపాన్ని సంతరించుకుంది. ఇదంతా 'నడుస్తున్నచరిత్ర ' పత్రిక చరిత్ర. తెలుగుజాతి ప్రజల మదిలో ఒక భాషోద్యమ నిర్మాణపత్రికగా ఎంతో గుర్తింపును పొందింది. దాని ఫలితంగానే “అమ్మనుడి” పేరుతో 2015 మార్చి నుండి ప్రయాణం సాగుతున్నది.

ఇటువంటి పత్రికలు- ప్రజలభాషలలో... అందునా, తెలుగులో ఎంతకాలం మనగలుగుతున్నాయనేది ఇక్కడ చర్చించే విషయం కాదు. చారిత్రక అవసరాలను తీర్చడంలో ఈ పత్రికలు ఎంతో కృషిచేశాయి. చరిత్రను సృష్టించాయి. అమ్మనుడి ఒక నిర్మాణాత్మక భాషోద్యమ పత్రికగా అనతి కాలంలోనే ఎంత విశిష్టతను సాధించిందో చదువరులకు తెలిసిందే. దీన్ని నిరంతరం కొనసాగించడానికై ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మూడు నెలలపాటు- మే, జూన్‌, జులై సంచికలను ప్రచురించలేక పోతున్నాము. మళ్ళీ ఆగస్టు 2021 సంచిక నుండి ప్రతీ నెల వెలువడగలదని మనవిచేస్తున్నాము. అమ్మనుడి చదువరులు సహకరిస్తారని నమ్ముతున్నాము.

ప్రత్యేక సంచికగా “అమ్మనుడి ఆగస్టు 2021 సంచిక

గిడుగు వేంకటరామమూర్తి గారి 158వ పుట్టినరోజు సందర్భంగా వెలువడనున్న ప్రత్యేక సంచికలో వ్యాస రచనలకోసం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. రచనలు మాకు చేరవలసిన చివరితేది: జులై 15

-సంపాదకుడు “అమ్మనుడి”

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

6