పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

ఉషాపరిణయము


గీ.

యట్టి శౌరికి మనుమం డుదారబలుఁడు
పంచబాణాత్మభవుఁడు శోభనగుణప్ర
[1]సిద్ధుఁ డతివిక్రమకళాసమృద్ధుఁ డీతఁ
డవని ననిరుద్ధుఁ డనఁ గడు నతిశయిల్లు.

71


ఉష యనిరుద్ధుని దోడితెమ్మని చిత్రరేఖను వేఁడుట

వ.

అనినఁ జిత్రరేఖకు నుషాకన్య యిట్లనియె.


క.

మానిని! యీతఁడు వోనా
మానధనముఁ గొల్లలాడి మక్కువమీరం
గా ననుఁ గూడిన ప్రియుఁ డను
మాన మొకింతయును లేదు మది నూహింపన్.

72


ఆ.

అనుచు దనుజపుత్రి యాచిత్రరేఖతో
మనముఁ దెలియఁబల్కి మఱియు ననియెఁ
జెలియ! యింకఁ దామసించిన నెటులోర్తు
వేగ తోడి తెమ్ము విభుని నిటకు.

73


వ.

అనినఁ జిత్రరేఖ చిఱునవ్వుతో నయ్యుషాకన్యఁ జూచి యిట్లనియె.


ఉ.

ఎవ్వరు? మెత్తు రీపలుకు లేణవిలోచన! చూడ నెంతయున్
దవ్వుల దుర్గమంబయిన తావున నుండెడువాని నొక్కనిన్
బువ్వులవిల్తుకేళిఁ గల మోదముమీరఁగఁ గూడి యీక్రియన్
నెవ్వగఁ జెంది యాపురుషు నీవిటఁ దెమ్మనిపల్కె దొప్పుగన్.

74


వ.

అని మఱియును.

  1. సిద్ధుఁ డతివిక్రమకళాసమృద్ధుఁ డితఁ డ
    వని ననిరుద్ధుఁ డనఁగ గడు నతిశయిల్లు.