పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

ఉషాపరిణయము


క.

హాలాసేవనసంతత
హేలాలహరీవిహారి హీరహిమానీ
[1]హేలాకరసితగాత్రుఁడు
నీలాంబరుఁ డితఁడు నీలనీరదచికురా!

67


సీ.

కరుణారసోత్తుంగశరణాయితాపాంగ
        వీక్షణుం డఖిలైకరక్షణుండు
శరణాగతత్రాణకరణాదరధురీణ
        చరణాంబుజుండు శ్రీకరభుజుండు
తరుణారుణకిరీటభరణాత్తరుచికూట
        భాసురుండు పరాజితాసురుండు
[2]తరుణార్తజనతాపహరణాదరదురాప
        కీర్తనుండు శుభప్రవర్తనుండు


గీ.

పావనుండు భయార్తద్విపావనుండు
మాధవుండు బుధారామమాధవుండు
శ్రీధరుండు నవాంబుదశ్రీధరుండు
రాజగోపాలుఁ డీతఁ డోరాజవదన!

68


సీ.

హృదయలక్ష్యవిభేదిమృదుసురభిళబాణు
        నారీమనోహరణప్రవీణుఁ
బాకారినీలప్రపంచవంచకవర్ణు
        లలితకళాజాలలబ్ధవర్ణు
నిక్షుకోదండోపలక్షితనిజబాహుఁ
        జారువల్గనరాజకీరవాహు
శుకపికశారికానికురుంబపరివారు
        నంబుధివరతనయాకుమారు

  1. లాలకర
  2. తరుణార్థ