పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

97


గీ.

సునిశితములైన ముద్గరశూలచక్ర
పరశుపట్టిసముఖఘనప్రహరణముల
నిఖలజగములు కంపింప నిగుడఁ జేసి
మించి ప్రద్యుమ్న తనయుని ముంచె మఱియు.

84


గీ.

బాణుఁ డీరీతి నొప్పింప బాణతతులఁ
గలఁగ కాతఁడు తన చేతిఖడ్గమునను
వానిరథకూబరముఁ ద్రుంచి పూనికలర
హయములను ద్రుంచి బెట్టేర్చె నతిశయమున.

85


క.

ఈరీతి విక్రమంబున
మీరిన యనిరుద్ధుఁ జూచి మేల్మే లనుచున్
భూరిముదంబునఁ బొగడుచు
నారదుఁ డట నిల్చి నింగి నాట్యముఁ జేసెన్.

86


క.

ఎంతయుఁ గినుకను బాణుఁడు
పంతముమీరంగ వివిధబాణంబులచే
గంతునికొడుకును ననిలో
నంతర్హితుఁ జేయ దనుజు లార్చిరి పెలుచన్.

87


సీ.

అనిరుద్ధుఁ డవియెల్ల నడిదంబుచేఁ ద్రుంచి
        కోపించి తన్ను మార్కొన్న వాఁడు
కాలదండమురీతిఁ గాలాగ్నికైవడి
        మిక్కిలి దీవ్రమౌ నొక్కశక్తి
జగములు కలఁగంగ జ్వాలలు [1]నిండంగ
        ఘంటలు మ్రోయంగఁ గాంతి చెలఁగఁ
బ్రద్యుమ్ననందనుపైఁ బ్రయోగించిన
        నలశక్తియే పూని యాఘనుండు

  1. నిడుంగ