పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

ఉషాపరిణయము


గీ.

కలికి! నీవు చేసిన యుపకారమునకు
నిపుడు ప్రత్యుపకారంబు లేమి సేతు?
ననుచు సొమ్ములుఁ గోకలు నతివ కొసఁగి
గదిసి కౌఁగిటఁ జేర్చెను గారవమున.

103


క.

శ్రీరఘునాథసుధాంబుధి
కైరవిణీమిత్ర! సకలకవినుతపాత్రా!
భూరిభుజాబలనిర్జిత
వైరిజనస్తోమ! విపులవైభవధామా!

104


క.

చెంగమలేశపదాంబుజ
[1]సంగస్ఫురితాంతరంగ! సదయాపాంగా!
సంగీతసాహితీప్రియ!
సంగరకౌంతేయ! సకలసజ్జనగేయా!

105


ద్రుతవిళంబిత వృత్తం

సుజనరక్షణశోభనవీక్షణా!
విజయకారణవిశ్రుతవారణా!
విజయశాత్రవవీరనుతాహవా!
విజయరాఘవ! విక్రమభార్గవా!

106


గద్య.

ఇది శ్రీమద్రాజగోపాలకరుణాకటాక్షవీక్షణానుక్షణప్రవర్ధమాన
సారసారస్వతధురీణయు విచిత్రతరపత్రికాశతలిఖితవాచికార్థావగా
హనప్రవీణయు తత్ప్రపత్రికాశతస్వహస్తలేఖనప్రశస్తకీర్తియు
శృంగారరసతరంగితపదకవిత్వమహనీయమతిస్ఫూర్తియు అతు
లితాష్టభాషాకవితాసర్వంకషమనీషావిశేషశారదయు రాజనీతి

  1. సంగి