పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

ఉషాపరిణయము


వ.

అని పలుకు నుషాకన్యక జూచి నెచ్చెలు లిట్లనిరి.


సీ.

ఆచిత్రరేఖ దా నఖిలలోకంబులఁ
        బొలుపుమీరుచు నున్న పురుషవరుల
భావంబులెల్లను బటమున వ్రాసిన
        [1]మహిమ నెఱుంగవా మగువ! నీవు
మహిలోనఁ గల్గిన మాయావిశేషముల్
        దండ్రిచే నేర్చె నాతలిరుఁబోణి
మన్ననమీర నీమగనిఁ దోడ్కొనివచ్చుఁ
        గలకంఠిరో! నీవు కలఁగకమ్మ!


గీ.

ముజ్జగంబులఁ గల్గిన ముదితలెల్లఁ
జిత్రరేఖకు నెనయె విచిత్రమహిమ
నేవిధంబుననైన నాయిందువదన
వేడుకలుమీఱ ననిరుద్ధుఁ దోడితెచ్చు.

98


చిత్రరేఖ యనిరుద్ధుని నుషవద్దికి జేర్చుట

వ.

అని యూఱడించు సమయంబున.


సీ.

వాయుతనూజుండు వాయువేగంబున
        సంజీవనిం దెచ్చుచందమునను
వినతాతనూజుండు వేడుకమీరంగ
        నమృతంబు దెచ్చినయందమునను
నల్ల భగీరథుం డాత్మ నుప్పొంగుచు
        నమరనదిం దెచ్చునట్టిలీలఁ
జెలువంబు వెలయంగా శ్రీరాజమన్నారు
        పారిజాతముఁ దెచ్చు భావమునను

  1. మయిమెరుంగవా