పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

ఉషాపరిణయము


క.

ముచ్చు వగమీర నెచ్చెలి
యచ్చటిసతు లెఱుఁగకుండునట్లుగ వేగన్
బచ్చవిలుకాని తనయుని
నచ్చెరువుగఁ దోడి తెచ్చు నాసమయమునన్.

92


అనిరుద్ధుని దోడ్కొనివచ్చుటకై చనిన చిత్రరేఖ రాకయున్నందులకు నుష చింతించుట

క.

అనిరుద్ధునిఁ దోడ్కొని యిదె
వనితామణి చిత్రరేఖ వచ్చు నటంచున్
దనరెడు చెలిమిని బాణుని
తనుజన్ గైసేయునట్టి తలఁపమరంగన్.

93


సీ.

పన్నీటి చేతను బాగుమీరఁగ నంత
        జలకంబు లాడించె సకియ యొకతె
పొసఁగంగ నవరత్నభూషణావళులచే
        నెలమి శృంగారించెఁ జెలియ యొకతె[1]


గీ.

విదియచందురుమించిన వెలఁదినుదుట
దిలక మొప్పఁగఁ దీర్చెను గలికి యొకతె
తీరుమీరఁగఁ బాపటఁ దీర్చి చెలికిఁ
గొప్పు సవరించె నొప్పుగఁ గొమ్మయొకతె.

94


వ.

అంత.


సీ.

ప్రతి లేని పసిఁడిచప్పరపుమంచంబునఁ
        బరఁగు కుంకుమపూలపఱఫుఁ బఱచి
కళుకుసూర్యపటంబుతలగడ లమరించి
        బాగైన సకినలబటువు లుంచి

  1. ఈ పద్యమున సీసపాదములు రెండు మాత్రమే యున్నవి.