పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

44

కలసినచో గొప్ప సత్వమగుచున్నది. రజమునకు మఱియొక రజము సహాయమైనచో విశేష మగుచున్నది. తమమునకు మఱింత వృద్ధియగుచున్నది. వేరొకతమము సహాయమైనచో మఱింత అందువల్ల నేగృహస్థాశ్రమములో భార్యాభర్తలును, అన్న దమ్ము లును, బావమరదులును, తండ్రికుమారులును, సత్వగుణస్థులై ప్రేమస్వరూపులగుచుందుకు. రజస్తమస్థులైనచో, విరోధు లగుటకు కారణమగుచున్నది.

111. చచ్చిపోయిన పిదప నేను నరకమునకు పోదునా? స్వర్గమునకు పోదునా? లేక మోక్షమునకు పోదునా అని ఒకరిని అడుగవలసిన అవసరము లేదు. దానికి తపస్సు చేయవలసిన పనికూడా వలదు, ఇప్పుడు మన హృదయములో యున్న గుణము లనుబట్టీ అందఱును చక్కగా తెలుసుకొనవచ్చును. ఎట్లనగా, సత్వగుణము యుండగా చనిపోయినచో స్వర్గలోక మునకు పోవును. రజోగుణము యున్నప్పుడు చనిపోయినచో మనుష్య జన్మమును పొందును. తమోగుణము యున్నప్పుడు చనిపోయి నరకమునకు పోవును. లేక పై జెప్పిన త్రిగుణములను జ్ఞానయోగముచే రహితము జేసుకొనినచో మోక్షమునకు పోవు దురని తెలియవలెను.

112. కొందఱు మా సుందరమునకు సుకుమారమునకు, సౌఖ్యములకు, భంగముకలుగకుండా మోక్షమురావలె నను కొనుచుందురు. అట్లన్నటికిని రానేరదు. ఎట్లనగా, పెఱుగు చెడకుండా మధించకుండా వెన్న ఎట్లు రానేరదో, చెఱుకు నలుగ కుండా పిప్పిగాకుండా బెల్లము ఎటురానేరదో అట్లే, ఈ దేహ