పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

51


గొలుచువారికి నిష్టఫలదులై నిజశిష్య
        బహుళదారిద్ర్యనిఫాళు లనఁగ


గీ.

నన్ను సర్వంబునందుఁ గానంగఁజాలు
ఘనత చేపట్టి వేదమార్గప్రతిష్ట
బదిలు లననుండుదురు భవద్భావివంశ
జాతు లాచార్యముఖ్యులు చారుచరిత.

202


సీ.

ప్రతివాదివేదండపంచాననంబులు
        నిజధర్మపాలననివుణమతులు
కలలోననైన నవ్వులకైన భవియగు
        మూఢు నీక్షింపని గాఢయశులు
షట్కాలముల నన్ను శాస్త్రోక్తమార్గంబు
        చే సమారాధించు శిష్టమూర్తు
లిది సుఖ మిది దుఃఖ మిది నాయ దిది వాని
        దని విభేదంబు సేయనిమహాత్ము


గీ.

లొరుల ధనదాతలకు నింతయును మనమున
నఱ్ఱుతలఁ చని నిత్యపుణ్యాభిరాము
లర్థి ముదిగొండపురవరాధ్యక్షు లగుచు
వెలయఁగల రింగ మీవారు విమలచరిత!

203


గీ.

ఖచరవరులను రక్షింపఁ గలుగుఁ గీర్తి!
వలదు తడ విఁకఁ జేయ నోయలఘుమూర్తి!
పావనము సేయు పాదసంస్పర్శనమున
గలుషయుత మైన వసుమతీతలము నెల్ల.

204


ఆశ్వాసాంతము

శా.

ధీవిస్ఫూర్తి పయోజసంభవ భవానీ[1]సంస్తవోచ్చారణ
ప్రావీణ్యక్షమభావ! భావభవదూరస్వాంత రాజీవ రా

  1. ధీన. పా. అం.